Gold Price Today: అక్షయ తృతీయ తర్వాత క్రమంగా క్షీమిస్తూ వస్తున్న పసిడి ధరలు సోమవారం అనూహ్యంగా పుంజుకున్నాయి. అలాగే ఇరాన్ అధ్యక్షుడి మరణం, యూఎస్ వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు కలిసి బంగారాన్ని చారిత్రాత్మక గరిష్టాలకు చేర్చిన సంగతి తెలిసిందే. అయితే కేవలం ఒక్కరోజులోనే ఈ హీట్ చల్లారిపోయింది.
సోమవారం భారీ పెరుగుదల తర్వాత మంగళవారం బంగారం, వెండి లోహాల ధరలు అంతర్జాతీయంగా చల్లారటంతో దేశీయ మార్కెట్లలో రిటైల్ విక్రయ ధరలు సైతం తదనుగుణంగా భారీ క్షీణతను చూశాయి. దీనికి తోడు అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ దేశ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన తర్వాత మాత్రమే వడ్డీ రేట్లను తగ్గిస్తామని తేల్చి చెప్పటంతో పసిడి ధరలు పరిడిపోయాయి. నిన్నటి రేటు తగ్గింపు తర్వాత నేడు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇది నిజంగా పసిడి ప్రియులకు శుభవార్త. షాపింగ్ చేద్దామని అనుకునేవారికి సరైన సమయంగా నిపుణులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో నిన్న ఒక్క ఔన్స్ 24 క్యారెట్ల బంగారం ధర 2430.90 డాలర్లుగా ఉండగా.. నేడు స్వల్ప క్షీణతతో 2413 డాలర్ల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. అలాగే భారత MCX మార్కెట్లో జూన్, జూలైలో ముగిసే బంగారం, వెండి ఫ్యూచర్లు సైతం నేడు పడిపోయాయి. నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 0.31 శాతం తగ్గి రూ.73,795.00కి చేరుకోగా, కిలో వెండి ధర 0.53 శాతం తగ్గి రూ.94,219.00కి చేరుకుంది. వీటికి అనుగుణంగా ఈరోజు దేశీయ రిటైల్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,840గా ఉంది.
బంగారం ధరలు కొంత స్థిమితంగా కొనసాగుతున్నప్పటికీ వెండి రేట్లలో మాత్రం దూకుడు తగ్గలేదు. నేడు వెండి కేజీ ధర నిన్నటితో పోల్చితే రూ.1,200 పెరిగి తెలుగు రాష్ట్రాల్లోని నగరాలైన విజయవాడ, నెల్లూరు, తిరుపతి, విశాఖ, ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లలో నేడు రిటైల్ విక్రయ ధర కేజీ రూ.1,00,300కి పెరిగింది. వాస్తవానికి రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో వెండిని వినియోగించటం వల్ల ఇటీవలి కాలంలో లోహం ధర భారీగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్లపై ద్రవ్యోల్బణం తగ్గేంత వరకు వడ్డీ రేట్ల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పటంతో ప్రస్తుతం గోల్డ్ ధరలు మరికొంత కాలం తగ్గుదలను నమోదు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications