Gold Rate: శుక్రవారం గోల్డ్ రివర్స్ జర్నీ.. నేడు రూ.1100 పెరిగిన పసిడి, 4000 తగ్గిన సిల్వర్..
Gold Price Today: గురువారం భారీగా క్షీణించిన పసిడి ధరలు తిరిగి పుంజుకోవటం ప్రారంభించాయి. వారాంతం దగ్గరపడుతున్న వేళ పసిడి ధరలు మళ్లీ పెరగటం కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీపావళి వచ్చేవారంలో ఉండటంతో చాలా మంది దనత్రయోదశి కోసం కూడా కొనుగోళ్లు చేపడుతున్నారు. ఈ క్రమంలో రేట్లు పెరగటం గందరగోళానికి గురిచేస్తోంది. కొనుగోలు చేయాలా లేక ఆగాలా అనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1000 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7295, ముంబైలో రూ.7295, దిల్లీలో రూ.7310, కలకత్తాలో రూ.7295, బెంగళూరులో రూ.7295, కేరళలో రూ.7295, వడోదరలో రూ.7300, అహ్మదాబాదులో రూ.7300, జైపూరులో రూ.7310, లక్నోలో రూ.7310, మంగళూరులో రూ.7295, నాశిక్ లో రూ.7298, మైసూరులో రూ.7295, అయోధ్యలో రూ.7310, బళ్లారిలో రూ.7295, గురుగ్రాములో రూ.7310, నోయిడాలో రూ.7310 వద్ద కొనసాగుతున్నాయి. అయితే ఇవి చట్టపరమైన పన్నులు, వ్యాపారి లాభాలు, తరుగు మజూరి వంటి ఖర్చులను జోడించక మునుపటి ధరలుగా గుర్తుంచుకోండి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1100 పెరుగుదలను చూసింది. దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7958, ముంబైలో రూ.7958, దిల్లీలో రూ.7973, కలకత్తాలో రూ.7958, బెంగళూరులో రూ.7958, కేరళలో రూ.7958, వడోదరలో రూ.7963, అహ్మదాబాదులో రూ.7963, జైపూరులో రూ.7973, లక్నోలో రూ.7973, మంగళూరులో రూ.7958, నాశిక్ లో రూ.7961, మైసూరులో రూ.7958, అయోధ్యలో రూ.7973, బళ్లారిలో రూ.7958, గురుగ్రాములో రూ.7973, నోయిడాలో రూ.7973గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7295గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7958 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7295గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7958 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.4000 తగ్గి నేడు రూ.1,07,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా నిలిచాయి. భౌగోళిక రాజకీయ అస్థిరత సమయంలో బంగారం తరచుగా సురక్షితమైన ఆస్తిగా కనిపిస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఈ పరిస్థితులు పసిడి ధరను పెంచుతారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, విస్తృత ఆర్థిక పరిస్థితులు వంటి ఇతర అంశాలు కూడా బంగారం ధరల కదలికలో పాత్ర పోషిస్తాయి. మీకు బంగారం పెట్టుబడులపై ఆసక్తి ఉంటే వార్తలు, మార్కెట్ ట్రెండ్స్ రెండింటినీ గమనిస్తూ ఉండటం మంచిది.


Click it and Unblock the Notifications