Gold Rate: యుద్ధం నుంచి తప్పుకున్న గోల్డ్.. నేడు రూ.2,700 తగ్గిన పసిడి.. Do Shopping..
Gold Price Today: ప్రస్తుతం గత నెల రోజులుగా భారీ ఊగిసలాటలో పసిడి ధరలు కొనసాగుతున్నాయి. దీంతో చాలా మంది భారతీయ రిటైల్ కొనుగోలుదారులు అయోమయంలో ఉన్నారు. ఉగాది, నవరాత్రులు వంటి పండుగలకు ఆభరణాలు కొనేందుకు ఆత్రుతగా ఉన్నారు.
నేడు 22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు రూ.2,500 తగ్గి పెద్ద ఊరటను ఇచ్చింది. దీంతో రిటైల్ కొనుగోలుదారులు అవసరమైన షాపింగ్ చేయాలని చూస్తున్నారు. దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన పసిడి విక్రయ రిటైల్ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.64,300, ముంబైలో రూ.63,350, దిల్లీలో రూ.63,500, కలకత్తాలో రూ.63,350, బెంగళూరులో రూ.63,350, కేరళలో రూ.63,350, వడోదరలో రూ.63,400, జైపూరులో రూ.63,500, నాశిక్ లో రూ.63,380, మైసూరులో రూ.63,350, అయోధ్యలో రూ.63,500, బళ్లారిలో రూ.63,350, గురుగ్రాములో రూ.63,500 వద్ద నేడు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 100 గ్రాములకు నేడు రూ.2,700 తగ్గి కొనుగోలుదారులకు ఊరటను కలిగించింది. దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ రేట్లను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.70,150, ముంబైలో రూ.69,110, దిల్లీలో రూ.69,260, కలకత్తాలో రూ.69,110, బెంగళూరులో రూ.69,110, కేరళలో రూ.69,110, వడోదరలో రూ.69,160, జైపూరులో రూ.69,260, నాశిక్ లో రూ.69,140, మైసూరులో రూ.69,110, అయోధ్యలో రూ.69,260, బళ్లారిలో రూ.69,110, గురుగ్రాములో రూ.69,260గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.63,350గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.69,110 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.400 పెరిగి రూ.82,000 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications