Gold Price Today: గడచిన మూడు రోజులుగా స్థిరంగా కొనసాగిన పసిడి ధరలు నేడు తగ్గుదలను చూశాయి. దీంతో రాఖీ పౌర్ణమి తర్వాత భారతీయ గోల్డ్ లవర్స్ తమ షాపింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి తోడు శ్రావణ మాసంలో శుభకార్యాల కోసం కూడా గోల్డ్, సిల్వర్ షాపింగ్ మెుదలుపెట్టేవారు నేడు తగ్గిన ధరలను ముందుగా పరిశీలించాల్సిందే.
22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.1000 తగ్గుదలను చూసింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన గోల్డ్ రేట్లను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.6660, ముంబైలో రూ.6660, దిల్లీలో రూ.6675, కలకత్తాలో రూ.6660, బెంగళూరులో రూ.6660, కేరళలో రూ.6660, వడోదరలో రూ.6665, జైపూరులో రూ.6675, మంగళూరులో రూ.6660, నాశిక్ లో రూ.6663, అయోధ్యలో రూ.6675, బళ్లారిలో రూ.6660, నోయిడాలో రూ.6675, గురుగ్రాములో రూ.6675గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.1200 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో తగ్గిన గోల్డ్ రేట్లను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7265, ముంబైలో రూ.7265, దిల్లీలో రూ.7280, కలకత్తాలో రూ.7265, బెంగళూరులో రూ.7265, కేరళలో రూ.7265, వడోదరలో రూ.7270, జైపూరులో రూ.7280, మంగళూరులో రూ.7265, నాశిక్ లో రూ.7268, అయోధ్యలో రూ.7280, బళ్లారిలో రూ.7265, నోయిడాలో రూ.7280, గురుగ్రాములో రూ.7280గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6660గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7265 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,100 పెరిగి రూ.92,000 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications