Gold Rate: గోల్డ్ లవర్స్‌కి బ్యాడ్ న్యూస్.. రేపు పక్కా పెరగనున్న పసిడి ధర! పూర్తి వివరాలు..
Gold Price Today: రోజురోజుకూ పసిడి ప్రియులు ఆందోళనలోకి వెళ్లిపోతున్నారు. బంగారు ఆభరణాలు కొనాలని ప్లాన్ చేస్తున్నవారు ప్రస్తుత ధరల నిరంతర పెరుగుదలతో అయోమయంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో మరో షాక్ వారికోసం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో వెండి కూడా ధరల వడ్డనకు సిద్ధంగా ఉంది.
పసిడి ఫిబ్రవరి ఫ్యూచర్స్ MCXలో నేడు భారీ పెరుగుదలతో రెండు నెలల గరిష్ఠాలకు చేరుకున్నాయి. దీంతో 10 గ్రాముల గోల్డ్ ధర ఉదయం ట్రేడింగ్ సమయంలో రూ.78,850 మార్కును తాకింది. ఇదే క్రమంలో వెండి మార్చి ఫ్యూచర్స్ కేజీకి రూ.622 పెరిగి రూ.92,064కి చేరుకుంది. కేవలం ఒక్క నెలలో గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.2400 పెరగగా.. వెండి ధర కేజీకి రూ.3700 పెరుగుదలను చూసింది. అయితే నేడు ఎంక్స్ఛేంజీల్లో పెరిగిన ధరలు రేపు రిటైల్ ధరలపై ప్రభావం చూపుతాయని తెలుస్తోంది. ఇప్పటికే జనవరి ప్రారంభం నుంచి గోల్డ్ నిరంతరం పెరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది. తొలిరోజు బాధ్యతలు చేపట్టిన తర్వాత యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ వివిధ దేశాలపై సుంకాలు విధించకుండా వెనక్కి తగ్గారు. అలాగే బైడెన్ పరిపాలన సమయానికి సంబంధించిన అనేక విధానాలను కూడా రివర్స్ చేసిన సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో ఉక్రెయిన్-రష్యాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగితే పసిడికి డిమాండ్ తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈవారంలో కూడా బంగారం, వెండి ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణంగా ఆయన పేర్కొన్నారు.
భౌతిక బంగారం ధరలు..
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7450గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8123 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7450గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8123 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,04,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications