అనిల్ అగర్వాల్ కల చెదిరిందా..? ఇప్పుడు రేసులో అంబానీ, అదానీ, టాటాలు..!
Chip Making: తరువాతి తరం వృద్ధిని ప్రారంభించే క్రమంలో దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో వేదాంత గ్రూప్ దీనిని అందిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలో ప్రభుత్వ రాయితీలను అందిపుచ్చుకునేందుకు ఫాక్స్ కాన్-వేదాంత కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో గుజరాత్ రాష్ట్రంలో అవి తమ సెమీకండక్టర్ల తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. అయితే నిబంధనలను పూర్తిగా పాటించకపోవటం, సబ్సిడీలకు ఆమోదం పొందడంలో జాప్యం వల్ల అనేక సమస్యలు ఎదురయ్యాయి. పైగా ప్రాజెక్టు మంజూరు కోసం పదేపదే దరఖాస్తులు విఫలమయ్యాయి.

అయితే తన వ్యాపార ఆలోచనను ముందుకు తీసుకెళ్లేందుకు ఫాక్స్ కాన్ సంస్థ భారతదేశంలో ప్రధాన కంపెనీల కూటమిని వెతుకుతోంది. అయితే రుణ భారంతో సతమతమౌతున్న వేదాంత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంతో సమస్యలు కొనసాగుతున్నాయి. దీనికి ముందు రెండు సంస్థలు గుజరాత్ లోని ధోలేరాలో సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి.
ఒకపక్క ఫాక్స్ కాన్-వేదాంత ప్లాన్ అటకెక్కిన వేళ.. అమెరికాకు చెందిన మైక్రోన్-టాటా గ్రూప్ ప్రస్తుతం OSAT ఫ్యాక్టరీ ప్రాజెక్ట్‌ను నడుపుతున్నాయి. ఫాక్స్ కాన్ ఇన్వెస్ట్మెంట్ ప్రకటన చేయగానే తమిళనాడు తరఫున కైడెన్స్ తమిళనాడు సంస్థ ప్రతినిధులు చిప్ తయారీదారులను వ్యక్తిగతంగా కలిశారు. ప్రస్తుత తరుణంలో వేదాంత గ్రూప్ తో బంధాన్ని తెంచుకుని కొత్త భాగస్వాముల కోసం వెతకాలని ఫాక్స్ కాన్ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో టాటా, అంబానీ, అదానీలతో కొత్త పొత్తు కుదుర్చుకుంటోంది.


Click it and Unblock the Notifications