Market Down: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజు కూడా తమ పతనాన్ని కొనసాగించాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ, సెన్సెక్స్ మాత్రం బలహీనంగా ముగించాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న సమర్పించిన తర్వాత బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ స్టాక్‌లు నష్టాల పరంపరను కొనసాగించటంతో వరుసగా నాల్గవ ట్రేడింగ్ సెషన్‌లోనూ నష్టాన్ని నమోదు చేశాయి. చాలా మంది నిపుణులు గ్రామీణ వినియోగానికి ప్రాధాన్యతనిస్తూ మొత్తం బడ్జెట్‌ను ప్రోత్సాహకరంగా ఉందని భావిస్తున్నారు. తయారీ, MSMEలకు ప్రోత్సాహం కూడా బాగానే ఉందని వారు భావిస్తున్నారు. దేశంలోని గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం రూ.2.66 లక్షల కోట్లు కేటాయించింది. ఇందులో గ్రామీణ మౌలిక సదుపాయాలపై ఖర్చు కూడా ఉంది.

అయితే రియల్టీ రంగానికి దీర్ఘకాలిక లాభాలపై ఇండెక్సేషన్ బెనిఫిట్ తొలగించటం పెద్ద నష్టాన్ని కలిగించింది. క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ రేట్లను పెంచటంపై దేశంలోని మధ్యతరగతి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం పన్ను కట్టగలిగిన వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేశామని, వికసిత్ భారత్ సాధించటానికి ఇది దోహదపడుతుందని చెబుతోంది. అయితే నిన్నటి పతనం తర్వాత రియల్టీ, ఎనర్జీ రంగాలకు చెందిన షేర్లు తిరిగి నేడు కొంత కోలుకున్నాయి. మార్కెట్లో భారీ ఓలటాలిటీ కొనసాగిన వేళ ఇండియా విక్స్ కొంతమేర చల్లారింది.
ఈ క్రమంలో నిఫ్టీలో బజాజ్ ఫిన్‌సర్వ్, బ్రిటానియా ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్స్యూమర్, యాక్సిస్ బ్యాంక్, లాభపడిన వాటిలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టెక్ మహీంద్రా, బీపీసీఎల్, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి. అస్థిరత కారణంగా ట్రేండ్ మిశ్రమంగా ఉండటంతో ఎనర్జీ, రియల్టీ, ఫార్మా మంచి లాభాల్లో ప్రయాణాన్ని ముగించగా, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాల షేర్లు మాత్రం నష్టాన్ని చవిచూశాయని రెలిగేర్ బ్రోకరేజ్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 588 పాయింట్లు పెరగటంతో వీటిలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు సంతోషంలో ఉన్నారు. ఇదే క్రమంలో స్మాల్ క్యాప్స్ సైతం తమ బుల్ ర్యాలీని కొనసాగించాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications