Gold Rate Today: రోజులు గడిచేకొద్ది బంగారం ధరలు తగ్గింపు బాటలో కొనసాగుతున్నాయి. ధనికుల బీరువాల్లోని పేదవాడి గుమ్మంముందుకు ధరలు చేరుకుంటున్నాయి. దీంతో అనేక మంది పండగ షాపింగ్ మెుదలుపెట్టారు.
22 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.150 మేర తగ్గాయి. దీంతో ప్రముఖ నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.56,600, ముంబైలో రూ.56,100, దిల్లీలో రూ.56,250, కలకత్తాలో రూ.56,100, బెంగళూరులో రూ.56,100, కేరళలో రూ.56,100, వడోదరలో రూ.56,150, జైపూర్ లో రూ.56,250, కోయంబత్తూరులో రూ.56,600, నాశిక్ లో రూ.56,130, గురుగ్రామ్ లో రూ.56,250, బళ్లారిలో రూ.56,100, నోయిడాలో రూ.56,250 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రిటైల్ మార్కెట్లో నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.160 మేర తగ్గుదలను నమోదు చేసింది. దేశంలోని నగరాల్లో పరిశీలిస్తే.. చెన్నైలో రూ.61,750, ముంబైలో రూ.61,200, దిల్లీలో రూ.61,350, కలకత్తాలో రూ.61,200, బెంగళూరులో రూ.61,200, కేరళలో రూ.61,200, వడోదరలో రూ.61,250, జైపూర్ లో రూ.61,350, కోయంబత్తూరులో రూ.61,750, నాశిక్ లో రూ.61,230, గురుగ్రామ్ లో రూ.61,350, బళ్లారిలో రూ.61,200, నోయిడాలో రూ.61,350గా ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలైన విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, గుంటూరు, విశాఖ, అనంతపురం, కడప, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్ నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.56,100, 24 క్యారెట్ల రిటైల్ విక్రయ ధర రూ.61,200 వద్ద కొనసాగుతోంది. ఇదే క్రమంలో వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీపై రూ.1000 తగ్గి రిటైల్ మార్కెట్లో రూ.76,500 వద్ద విక్రయించబడుతోంది.


Click it and Unblock the Notifications