ప్రపంచ ఆర్థిక మార్కెట్లు తీవ్ర అస్థిరతను ఎదుర్కొంటున్న ఈ సమయంలో.. స్టాక్ మార్కెట్ల నుంచి బంగారం, వెండి ధరల వరకూ భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. క్రిప్టో ప్రపంచం కూడా దీని నుండి తప్పించుకోలేకపోతోంది. ముఖ్యంగా బిట్‌కాయిన్ ప్రస్తుతం కిందకు జారిపోతుండగా, పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరుగుతోంది. అయితే ఈ భయానికి వీలులేకుండా, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వ్యక్తిగత ఆర్థిక పుస్తకం Rich Dad Poor Dad రచయిత రాబర్ట్ Kiyosaki మాత్రం తన నమ్మకాన్ని మార్చుకునే అవకాశం ఇవ్వడం లేదు. బిట్‌కాయిన్ క్రాష్‌కు కూడా ఆయన ప్రశాంతంగా నిలబడి, భవిష్యత్తులో ఈ ఆస్తుల విలువ మాత్రమే మరింత పెరుగుతుందని స్పష్టం చేశారు.
తాజా సోషల్ మీడియా పోస్ట్‌లో కియోసాకి.. బిట్‌కాయిన్ పడిపోతోంది. బంగారం, వెండి సహా అన్ని మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రతిదీ బుడగలా పగిలిపోతున్నట్లు కనిపిస్తోంది. అయినా నేను అమ్మడం లేదు. ఎందుకంటే నాకు నగదు అవసరం లేదని పేర్కొన్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. ఈ పతనం ఆస్తుల అసలు విలువ తగ్గినందుకు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన తీవ్రమైన నగదు సంక్షోభం వల్ల జరుగుతోందని తెలుస్తోంది.

కియోసాకి చేసిన మరొక ముఖ్య వ్యాఖ్య ఏంటంటే 'ది బిగ్ ప్రింట్' అనే భావన గురించి. ఇది ఆర్థిక నిపుణుడు లారెన్స్ లెప్పార్డ్ ప్రచురించిన సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం.. భవిష్యత్తులో అమెరికా సహా అనేక దేశాలు ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు భారీగా డాలర్లు ముద్రించే అవకాశం ఉంది. ఈ భారీ మనీ ప్రింటింగ్ ప్రక్రియ అంటే 'ది బిగ్ ప్రింట్'.. ప్రారంభమైన వెంటనే, ఫియట్ కరెన్సీ విలువ బలహీనపడుతుంది. అంటే, ప్రజల చేతిలో ఉన్న కాగితపు నాణాలు విలువ కోల్పోతాయి. అలాంటి పరిస్థితుల్లో సహజ వనరులు అయిన బంగారం, వెండి అలాగే పరిమిత సరఫరా ఉన్న క్రిప్టోకరెన్సీలు అయిన బిట్‌కాయిన్, ఎథెరియం విలువలు భారీగా పెరుగుతాయని కియోసాకి భావిస్తున్నారు.
అయితే ప్రజలు ఎందుకు అమ్మకాలకు దిగుతున్నారనే దానికి సమాధానంగా ఆయన చెప్పినదేమిటంటే.. భయంతో తక్షణ అవసరంతో చాలా మంది తమ ఖరీదైన ఆస్తులను అమ్మేస్తున్నారు. వారికి నగదు అవసరం. ఆందోళనలో వారు ఉత్తమ ఆస్తులను త్యజిస్తున్నారు. కానీ నేను అలా చేయను. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అప్పుల్లో మునిగిపోయినందున, భవిష్యత్ అస్థిరతలను దృష్టిలో పెట్టుకుని తాను ఈ ఆస్తులను దీర్ఘకాలం దాచుకుంటానని తెలిపారు.
కియోసాకి ఇన్వెస్టర్లకు ప్రత్యక్ష పెట్టుబడి సలహాలు ఇవ్వనప్పటికీ.. తన అనుభవాల్ని మాత్రమే పంచుకుంటానని తెలిపారు. మీరు భయం వల్ల చేసిన అమ్మకాలు మీకే నష్టమవుతాయి. మీరు చేసిన తప్పుల నుంచి నేర్చుకోండి. వాటినే మీ గురువులుగా తీసుకోండి అంటూ ఆయన సూచించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చదువుకున్నవారు కూడా ఆర్థికంగా వెనుకబడి ఉండటానికి ముఖ్య కారణం.. భయంతో తీసుకునే తప్పు నిర్ణయాలేనని వివరించారు. క్లుప్తంగా శాంతంగా ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. అత్యుత్తమ ఆస్తులను దీర్ఘకాలం దాచుకోవడం మంచిదంటూ ఆయన పోస్టులో తన సందేశాన్ని ముగించారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications