IT News: AI రాకతో ఊడిపోతున్న జాబ్స్.. మార్చిలో ఎంతమందంటే..??
AI Layoffs: అవసరాలు పెరుగుతున్న కొద్ది టెక్నాలజీ ఎలా పెరుగుతుందో.. టెక్నాలజీ పెరిగేకొద్ది టెక్కీలకు కష్టాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. అవును తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్కీల ఉద్యోగాలను పోగొడుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది ఉద్యోగాల కోతల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాలు పోయాయని మల్టీ నేషనల్ HR కంపెనీ గ్రే & క్రిస్మస్ నివేదించింది. మే ఒక్క నెలలోనే ఏకంగా 4000 మంది AI వల్ల ఉద్యోగాలను కోల్పోయినట్లు సంస్థ వెల్లడించింది. ఈ సంఖ్య మెుత్తం టెక్ లేఆఫ్ లలో దాదాపు 4.9 శాతంగా ఉన్నాయి. రానున్న కాలంలో ఇదే ధోరణి కొనసాగవచ్చని తెలుస్తోంది.

కొన్నాళ్ల కిందట IBM CEO అరవింద్ కృష్ణ ఒక ఇంటర్వ్యూలో ఏఐ వినియోగం గురించి కుండబద్దలు కొట్టారు. తమ కంపెనీలో ఖాళీ అయిన 6,800 ఉద్యోగాలను దశలవారీగా AI వినియోగంతో భర్తీ చేస్తామని తెలిపారు. ఇది ఖర్చులను సైతం తగ్గిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో మీడియా సంస్థ CNET కథనాలను రూపొందించడానికి AIని వినియోగంలోకి తీసుకురావటంతో రిపోర్టర్‌లను తొలగించింది.
మాట్లాడుతూ, కాలక్రమేణా తమ కంపెనీ AI ద్వారా 6,800 ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. CBS న్యూస్ నివేదించిన ప్రకారం, యజమానులు AIని ఉపయోగించుకునే తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాన్ని కోరడంతో ఇద్దరు కాపీ రైటర్‌లు తమ ఉద్యోగాలను కోల్పోయారు, అయితే మీడియా సంస్థ CNET కథనాలను రూపొందించడానికి AIని అమలు చేస్తున్నప్పుడు రిపోర్టర్‌లను తొలగించింది.
జనవరి-మే మధ్య కాలంలో 4,17,500 ఉద్యోగాలు పోయాయి. 2020 తర్వాత అత్యంత చెడ్డ కాలంగా దీనిని చెప్పుకోవచ్చు. అలాగే 2023 ప్రారంభంలో 2009 మాంద్యం తర్వాత అత్యధిక సంఖ్యలో దాదాపు 820,000 ఉద్యోగాల కోత నమోదైంది. మే నెలలో ఏఐ వినియోగంతో పాటు వ్యాపారాల మూసివేత ఉద్యోగుల తొలగింపులకు ప్రధాన కారణంగా నిలిచింది. ప్రతికూల ఆర్థిక పరిస్థితులు ఇందుకు కారణంగా వెల్లడైంది. రానున్న కాలంలో AI ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మంది ఫుల్ టైమ్ ఉద్యోగులను ప్రభావితం చేస్తుందని నిపుణుల అంచనాలు చెబుతున్నాయి. ఇది ప్రపంచ శ్రామికశక్తిలో దాదాపు ఐదవ వంతును ప్రభావితం చేయనుంది.


Click it and Unblock the Notifications