AI News: నిజమవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భయాలు.. చట్టవిరుద్ధంగా ట్రేడింగ్ చేసిన AI బోట్

AI News: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ప్రపంచ ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయింది. పనిలో ఉత్పాదకతను పెంపొందించుకోవడం దగ్గర నుంచి ఆదాయ సముపార్జన వరకు ఇదొక మార్గంగా నిలిచింది. అయితే GPT-4 ఆధారిత AIని ఉపయోగించి స్టాక్ మార్కెట్ లో చట్టవిరుద్ధంగా లాభపడవచ్చనే నివేదికలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

OpenAI విప్లవాత్మక మోడల్ ChatGPT అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అంతర్జాతీయ సమాజం కృత్రిమ మేధస్సుని చూసే విధానంలో భారీ మార్పు వచ్చింది. అభివృద్ధి చెందుతున్న ఈ తరహా సాంకేతికత వల్ల పలు ప్రయోజనాలు ఉన్నప్పటికీ అంతే స్థాయిలో ప్రతికూలతలు కూడా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Artificial Intelligence can do illegal stock market trade and capable to hide that info

యునైటెడ్ కింగ్‌డమ్ ఆర్గనైజ్ చేసిన AI సేఫ్టీ సమ్మిట్‌లోని డెమోలో.. ఈ సాంకేతికత ఉపయోగించి చట్టవిరుద్ధమైన ఆర్థిక లావాదేవీలు నిర్వహించవచ్చని తేలింది. అనంతరం తెలివిగా తన తప్పులను సైతం కప్పి పుచ్చుకోగలదని వెలుగులోకి వచ్చింది. ఈ డెమోలో సంస్థకు తెలియకుండా AI బోట్ స్టాక్స్ ట్రేడింగ్ కోసం నకిలీ సమాచారాన్ని వినియోగించినట్లు బయటపడింది. ఈ మేరకు ప్రముఖ మీడియా సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది.

స్థానిక ఫ్రాంటియర్ AI టాస్క్‌ఫోర్స్ ఈ డెమోను ప్రజెంట్ చేసింది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ద్వారా జరిగే నష్టాలను ఈ సంస్థ అంచనా వేస్తుంటుంది. AI భద్రతా విభాగంలో పనిచేసే అపోలో రీసెర్చ్ అనే కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టింది. తన పరిశోధన ఫలితాలను OpenAIతో పంచుకుంది. స్వయంప్రతిపత్తి, సామర్థ్యం కలిగిన AIలు మానవ జోక్యాన్ని అధిగమించే అవకాశం ఉందని హెచ్చరించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+