Trending Stock: ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలౌతాయనే సామెత ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయే కంపెనీ షేర్లకు అక్షరాలా సరిపోతుంది. మార్కెట్ల ర్యాలీ సమయంలో స్టాక్ తిరిగి పుంజుకోవటం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది అర్షియా కంపెనీ షేర్ల గురించే. ఒకప్పుడు ఈ కంపెనీ షేర్ గరిష్ఠంగా రూ.310 రేటును తాకింది. అయితే ఆ తర్వాత పతనం కారణంగా స్టాక్ రూ.3కి పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సొమ్ము ఆవిరైపోయింది. కానీ రెండు వారాలుగా మాత్రం తిరిగి పుంజుకుంది. ఈ స్టాక్ ఎన్ఎస్ఈలో నేడు 5% ఎగువ సర్క్యూట్‌ను తాకి రూ.6.65 ధర వద్ద ఉంది. గత కొన్ని రోజుల ట్రేడింగ్ పరిశీలిస్తే స్టాక్ నిరంతరం అప్పర్ సర్క్యూట్ తాకుతోంది.

ఆర్షియా లిమిటెడ్ స్టాక్ గడచిన రెండు వారాల్లో ఏకంగా 85 శాతం రాబడిని అందించింది. అదేవిధంగా నెల రోజుల పనితీరును పరిశీలిస్తే 70% పెరుగుదలను నమోదు చేసింది. 2010లో స్టాక్ రూ.310 రేటును దాటింది. నవంబర్ 29, 2023న షేర్ ధర రూ.3.46 వద్ద 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. అలాగే కంపెనీ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.10.40 వద్ద నిలిచింది. ఈ క్రమంలో నేడు కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.175.21 కోట్లుగా నమోదైంది.
గత నవంబర్‌లో ఆర్షియా లిమిటెడ్ అనుబంధ సంస్థలైన అర్షియా పన్వెల్ FTWZ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అర్షియా పన్వెల్ లాజిస్టిక్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ల ఆడిటర్ రాజీనామా చేశారు. అర్షియా ఫలితాలను గమనిస్తే.. జూన్ 2023 త్రైమాసికంలో నికర అమ్మకాలు 1.4% పెరిగి రూ.35.62 కోట్లకు చేరుకున్నాయి. జూన్ 2022 త్రైమాసికంలో ఇది రూ.35.13 కోట్లుగా నిలిచింది. అదే సమయంలో కంపెనీ నికర నష్టం 314.55% తగ్గి రూ.101.59 కోట్లకు చేరుకుంది.
కంపెనీ వ్యాపారాన్ని గమనిస్తే.. అర్షియా దేశంలోని ఫ్రీ ట్రేడ్ వేర్‌హౌసింగ్ జోన్‌ల (FTWZs) అభివృద్ధిలో అగ్రగామిగా కొనసాగుతున్నాయి. ఇది 2 FTWZలను నిర్వహిస్తున్న ఏకైక ఫ్రీ జోన్ డెవలపర్, పాన్-ఇండియా కార్యకలాపాలతో అతిపెద్ద ప్రైవేట్ కంటైనర్ రైలు ఆపరేటర్ గా ఉంది. ఇది 6 రైల్ లూప్ లైన్‌లతో కూడిన ఏకైక ప్రైవేట్ ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోని సొంతం చేసుకునే ప్రయోజనాన్ని కూడా కలిగి ఉంది. అర్షియా FTWZలు - ముంబై సమీపంలోని పన్వెల్ 165 ఎకరాల్లో విస్తరించింది. పశ్చిమ భారతదేశానికి, దిల్లీ సమీపంలోని ఖుర్జా, ఉత్తర భారతదేశానికి 325 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి.


Click it and Unblock the Notifications