IPO News: అదరగొట్టిన రియల్టీ ఐపీవో.. తొలిరోజే ప్రీమియం లిస్టింగ్ లాభాలు, కానీ..
Arkade Developers IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల కోలాహలం కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు మార్కెట్లోకి ఒక రియల్టీ కంపెనీ అడుగుపెట్టింది. ఇటీవల సెబీ హెచ్చరికలు ఉన్నప్పటికీ ఐపీవోలపై బెట్టింగ్ వేస్తున్న ఇన్వెస్టర్లలో ఎలాంటి మార్పులు కనిపించటం లేదు.
ప్రస్తుతం మనం మాట్లాడుకోబోతున్నది ఆర్కేడ్ డెవలపర్స్ కంపెనీ ఐపీవో గురించే. నేడు మార్కెట్లోకి వచ్చిన ఐపీవో బీఎస్ఈలో ఇష్యూ ధర కంటే 37.5 శాతం ప్రీమియం ధర రూ.176 వద్ద ఒక్కో షేరు లిస్ట్ అయ్యింది. నేడు స్టాక్ మార్కెట్లు బులిష్ జోరులో ఐపీవో సూపర్ స్టార్ గా కొనసాగుతోంది. ఇది వాస్తవ గ్రేమార్కెట్ ప్రీమియం ధర కంటే తక్కువ రేటుకు మార్కెట్లో జాబితా అయ్యింది. కంపెనీ ఫ్రెష్ ఇష్యూ, ఆఫర్ ఫర్ సేల్ కలిగి మార్కెట్ల నుంచి రూ.410 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఈ క్రమంలో ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి భారీగా స్పందన రావటంతో 106 సార్లు సబ్‌స్క్రయిబ్ అయింది.

కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.122.40 కోట్లను సమీకరించింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ ఐపీవోను సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఓపెన్ లో ఉంచింది. మెయిన్ కేటగిరీలో వచ్చిన ఐపీవో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో నేడు విజయవంతంగా జాబితా అయ్యింది. ఈ క్రమంలో కంపెనీ తన స్టాక్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.121-128గా ఉంచింది. అలాగే లాట్ పరిమాణాన్ని 110 షేర్లుగా ప్రకటించింది. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు కంపెనీ ఐపీవోలో పాల్గొనేందుకు రూ.14,080 ఇన్వెస్ట్ చేశారు. అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులు ఆఫర్‌కు 163.16 రెట్లు, సంస్థాగతేతర పెట్టుబడిదారుల కోటా 162.75 రెట్లు, రిటైల్ వ్యక్తిగత పెట్టుబడిదారుల భాగం 50.65 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది.
కంపెనీ ముంబై అంతటా ప్రధాన ప్రదేశాల్లో బలమైన పట్టుతో ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ఇది స్థిరమైన రాబడి వృద్ధి, పటిష్టమైన ఆర్థిక పనితీరును కనబరుస్తుంది. కంపెనీ తాజా ఐపీవో నుంచి సేకరించిన నిధుల్లో కొంత భాగాన్ని.. కొనసాగుతున్న ప్రాజెక్ట్‌లు-ఆర్కేడ్ నెస్ట్, ప్రాచి సీహెచ్‌ఎస్‌ఎల్, సీ-యూనిట్‌ల అభివృద్ధి ఖర్చులలో కొంత భాగాన్ని కవర్ చేయటానికి వినియోగించాలని నిర్ణయించింది. అలాగే భవిష్యత్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కోసం భూమి కొనుగోలుతో పాటు సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం కూడా తాజా నిధులను వినియోగించనుంది.
కంపెనీ మహారాష్ట్రలోని ముంబైలో హై-ఎండ్, అధునాతన జీవనశైలి రెసిడెన్షియల్ డెవలప్‌మెంట్‌లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. కంపెనీ తన వ్యాపారాన్ని రెండు విభాగాలుగా విభజించింది. ఇందులో ఒకటి కంపెనీ స్వాధీనం చేసుకున్న భూమిపై నివాస భవనాల అభివృద్ధికి అంటే కొత్త ప్రాజెక్టులు ఒక విభాగం. అలాగే రెండవ విభాగం ఇప్పటికే ఉన్న భవనాల పునరాభివృద్ధి చేస్తుంది. ఈ క్రమంలో 2017-2024 క్యూ1 మధ్య కంపెనీ 1,220 రెసిడెన్షియల్ యూనిట్లను ప్రారంభించింది.


Click it and Unblock the Notifications