లోన్ కావాలా.. సిబిల్ స్కోరు పడిపోయిందా ? అయితే ఈ సీక్రెట్స్ తెలుసుకోండి!
ఇల్లు కొనాలన్నా, కారు తీసుకోవాలన్నా, పర్సనల్ లోన్ తీసుకోవాలన్న మీ సిబిల్ స్కోర్ ఈ రోజుల్లో చాల ముఖ్యమైన విషయం. ఎందుకంటే లోన్ సాంక్షన్ కావాలన్నా లేదా.. ఒకవేళ శాంక్షన్ అయితే వడ్డీ రేటు ఎంత ఉండాలి ? అనే విషయాలు అన్ని కూడా మీ సిబిల్ స్కోర్ పైనే ఆధారపడి ఉంటుంది. 300 నుంచి 900 మధ్య ఉండే ఈ మూడు అంకెలు మీ క్రెడిట్ యోగ్యతను తెలియజేస్తుంది. అంటే ఇంతకుముందు మీరు తీసుకున్న లోన్లు, క్రెడిట్ కార్డు బిల్లుల పేమెంట్లు, మీ క్రెడిట్ రేషియో వంటి ఫైనాన్షియల్ ఆధారంగా ఈ స్కోర్ లెక్కిస్తారు.

మంచి సిబిల్ స్కోర్ అంటే సాధారణంగా 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే లోన్లు, క్రెడిట్ కార్డులు ఈజీగా అప్రూవ్ అవుతాయి. అంతేకాదు, తక్కువ వడ్డీ రేటుకే లోన్స్ పొందడానికి కూడా సిబిల్ స్కోర్ సహాయపడుతుంది. మరి మీ సిబిల్ స్కోర్ పెంచుకోవాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి:
1. క్రెడిట్ కార్డ్ బిల్లులు, ఈఎంఐలు టైంకి కట్టాలి: మీ సిబిల్ స్కోర్‌లో రిపేమెంట్ హిస్టరీ చాల ముఖ్యం. మీరు క్రమం తప్పకుండా రిపేమెంట్స్ చేస్తే ఆర్ధికంగా బాధ్యత ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. ఇందుకు మీ క్రెడిట్ కార్డ్ బిల్లులు, లోన్ ఈఎంఐలు టైంకి ముందే కట్టడం అలవాటు చేసుకోవాలి. దీని కోసం ఆటో-పే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. ఒకవేళ పేమెంట్ ఆలస్యమైతే వెంటనే బ్యాంక్ సంప్రదించి పరిష్కారం కోసం ప్రయత్నించండి.
2. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో: క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (CUR) అంటే మీ మొత్తం క్రెడిట్ లిమిట్లో మీరు ఎంత శాతం ఉయోగిస్తున్నారనేది. ఇది కూడా మీ సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ చేసే ముఖ్యమైన అంశాలలో ఒకటి. మీ CUR 30% కంటే తక్కువగా ఉండేలా చూసుకోండి. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ లక్ష రూపాయలు ఉంటే, మీరు నెలకు 30 వేలకు మించకుండా ఖర్చు చేయాలి. ఒకవేళ మీ ఖర్చులు ఎక్కువగా ఉంటే, మీ క్రెడిట్ లిమిట్ పెంచమని బ్యాంకును అడగొచ్చు.
3. క్రెడిట్ రిపోర్ట్ లోపాలను సరిచేసుకోవడం: ఒకవేల మీ సిబిల్ రిపోర్ట్లో పెండింగ్ బిల్స్, క్లోజ్ చేసిన లోన్ ఇంకా ఉన్నట్లు చూపిస్తే మీ సిబిల్ స్కోర్ పడిపోతుంది. కాబట్టి, మీ సిబిల్ రిపోర్ట్ క్రమం తప్పకుండా చెక్ చేయండి. CIBIL అధికారిక వెబ్‌సైట్ (www.cibil.com) ద్వారా మీరు ఫ్రీగా రిపోర్ట్ పొందవచ్చు. ఏదైనా తప్పులు కనిపిస్తే నేరుగా బ్యాంకును సంప్రదించండి.
4. ఎక్కువగా లోన్స్ లేదా క్రెడిట్ కార్డుల కోసం అప్లయ్ చేయకండి: మీరు ప్రతిసారీ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ కోసం అప్లయ్ చేసినప్పుడు, బ్యాంకులు మీ క్రెడిట్ రిపోర్టు పై 'హార్డ్ ఎంక్వైరీ' చేస్తాయి. ఇలా చేస్తే మీ స్కోర్ కొద్దిగా పడిపోతుంది.


Click it and Unblock the Notifications