Defence Funds: డిఫెన్స్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..!
మ్యూచువల్ ఫండ్లలో ఎక్కువ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ప్లెక్సీ క్యాప్, ఇండెక్స్ ఫండ్ల గురించి మాట్లాడుకుంటాం. అయితే థీమేటిక్ ఫండ్ల గురించి ఎక్కువగా మాట్లాడుకోరు. అయితే సైకిళ్లను బట్టి థీమేటిక్ ఫండ్స్ రాబడి ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే గత రెండు, మూడు సంవత్సరాలుగా భారత్ డిఫెన్స్ కంపెనీలు ఎగుమతులు పెంచాయి. ప్రభుత్వం కూడా డిఫెన్స్ బడ్జెట్ పెంచింది. ఈ నేపథ్యంలో డిఫెన్స్ స్టాక్ భారీగా ర్యాలీ అయ్యాయి. అందుకే ఏఎంసీ కంపెనీలు డిఫెన్స్ థీమేటిక్ ఫండ్స్ తీసుకొచ్చాయి. హెచ్ డీఎఫ్ సీ ఏఎంసీ మొదటగా HDFC డిఫెన్స్ ఫండ్ తీసుకొచ్చింది.
ప్రస్తుతం ఈ ఫండ్ రూ. 9,724.3 కోట్లను మెయింటేన్ చేస్తోంది. ఈ ఫండ్ రాబడి కూడా బాగానే ఇచ్చింది. హెచ్ డీఎఫ్సీ డిఫెన్స్ ఫండ్ బెంచ్‌మార్క్ కంటే 18.2 శాతం రిటర్న్స్ ఇచ్చింది. మూడు సంవత్సరాల్లో 32.7 శాతం రాబడి ఇచ్చింది. ఒక నెలలో ఈ ఫండ్ 5.9 శాతం రాబడిని అందించింది. మూడు నెలలలో రూ. 25.8 శాతం రాబడి ఇచ్చింది. ఈ ఫండ్ తర్వాత డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్లు వచ్చాయి. మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్, యాక్సిస్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్లు ఉన్నాయి.

HDFC డిఫెన్స్ ఫండ్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, భారత్ పోర్జ్, హిందస్థాన్ ఏరోనాటికల్, సోలార్ ఇండస్ట్రీస్, ఎంటీఆర్ టెక్నాలజీ, అస్ట్రో మైక్రోవేవ్ ప్రొడక్ట్ కంపెనీలో ఎక్కువగా పెట్టుబడి పెట్టింది. కాగా మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్ గత సంవత్సర కాలంగా 20 శాతం రాబడి ఇచ్చింది. ఈ ఫండ్ డిఫెన్స్ ఇండెక్స్ కంపెనీల్లో పెట్టుబడి పెడుతుంది. అయితే థీమేటిక్ ఫండ్లలో చాలా రిస్క్ ఉంటుంది. ఒక్కొసారి నెగిటివ్ రిటర్న్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నిపుణల సలహాతో థీమేటిక్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలి.
సాధారణంగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్నది. ఇందులో కాస్త రిస్క్ తక్కువ ఉండాలంటే.. లార్జ్ క్యాప్ లేదా ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చని చెబుతున్నారు. రిస్క్ ఎక్కువగా తీసుకునే వారు స్మాల్ క్యాప్ లేదా థీమేటిక్ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చని వివరిస్తున్నారు. రిస్క వద్ద అనుకున్నవారు డెట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చని సూచిస్తున్నారు. ఇక సురక్షితమై, కచ్చితమైన రాబడి రావాలంటే ఫిక్స్ డ్ డిపాజిట్ చేసుకోవచ్చని చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహా


Click it and Unblock the Notifications