ఫోన్‌పే వాడుతున్నారా? ఉచితంగా క్రెడిట్ కార్డు, అదిరిపోయే ఆఫర్లు! ఎలా పొందాలంటే..
ఫోన్ పే సంస్థ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లు ఉమ్మడిగా కలిసి ఓ కొత్త క్రెడిట్ కార్డుని ఆఫర్ చేస్తున్నాయి. అదే ఫోన్ పే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అల్టిమో క్రెడిట్ కార్డ్. ఈ కార్డు పొందడం ద్వారా అనేక గొప్ప ప్రయోజనాలు పొందొచ్చు. అంతేకాదు ఈ క్రెడిట్ కార్డు కూడా ఉచితంగా పొందే అవకాశం ఉంది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎలిజిబిలిటీ ఇదీ..
ఈ అల్టిమో క్రెడిట్ కార్డు ఫోన్ పే ద్వారా ఎక్కువ ఖర్చు చేసే వారికి అలాగే ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారికి అప్రూవ్ అవుతుంది. ఇది ప్రీమియం బెనిఫిట్స్ కలిగిన క్రెడిట్ కార్డు. ఈ కార్డు మొదటి సంవత్సరం ఉచితంగా లభిస్తుంది. ఆ తర్వాత యాన్యువల్ ఫీజు రూ. 999 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఏడాదిలో ఈ కార్డు ద్వారా మీరు రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేస్తే, ఆ ఫీజు కూడా ఉండదు. పూర్తిగా మాఫీ చేయబడుతుంది. ఇకపోతే కార్డు సేఫ్టీ ఫీచర్లు కూడా చాలా పటిష్టంగా ఉన్నాయి. ఈ కార్డు ద్వారా చేసే ట్రాన్సాక్షన్లు పూర్తిగా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటాయి.
ఇలా అప్లై చేయొచ్చు
ఈ ఫోన్ పే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అల్టిమో క్రెడిట్ కార్డ్ పొందడానికి మీరు నేరుగా ఫోన్‌పే యాప్‌లోకి వెళ్లాలి. అక్కడ కింద ఫోన్‌పే హెచ్‌డీఎఫ్‌సీ కార్డు(PhonePe HDFC Bank Ultimo Credit Card) కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే.. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, కెవైసీ డీటెయిల్స్ అడుగుతుంది. వాటిని సబ్మిట్ చేస్తే.. మీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ స్కొర్ తో పాటు మీరు ఫోన్ పే ద్వారా చేసే ఖర్చులను కూడా అంచనా వెసుకుని మీకు కార్డు అప్రూవ్ అవుతుందో లేదో చెప్తుంది. ఒకవేళ అప్రూవ్ అయితే కార్డు డీటెయిల్స్ రివీల్ అవుతాయి.
బెనిఫిట్స్ ఇవే..
ఈ కార్డు ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఫోన్‌పే యాప్ ద్వారా చేసే ఖర్చులకు గరిష్టంగా 10 శాతం రివార్డు పాయింట్లు లభిస్తాయి. అలాగే ఫ్లిప్ కార్ట్, అమెజాన్, జొమాటో, ఉబర్, మింత్రా వంటి షాపింగ్ యాప్స్ లో 5 శాతం రివార్డు పాయింట్లు పొందవచ్చు. అలాగే ఈ క్రెడిట్ కార్డు యాడ్ చేసి.. ఏదైనా యూపీఐ యాప్ ద్వారా స్కాన్ అండ్ పే చేస్తే ఒక శాతం రివార్డు పాయింట్లు లభిస్తాయి. ఇకవీటితో పాటు ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్, ట్రావెల్ టికెట్లపై అదనపు డిస్కౌంట్ల వంటి బోలెడు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. అయితే కార్డు తీసుకునేముందు హిడెన్ చార్జీలు ఏవైనా ఉన్నాయేమో చెక్ చేసుకుని తీసుకోవాలి. అలాగే కార్డు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా పూర్తిగా చదవాలి.


Click it and Unblock the Notifications


