వై-ఫై ద్వారా మని ట్రాన్స్ఫర్ చేస్తున్నారా.. పర్సనల్ డేటాతో సహా మొత్తం హ్యాక్.. !

ఎయిర్ పోర్ట్స్, మెట్రో, కాఫీ షాప్స్ లేదా షాపింగ్ మాల్స్ ప్రదేశాలలో ఫ్రీ Wi-Fi అని కనిపిస్తే వాడకుండా ఎవరు ఉంటారు చెప్పండి.. ఫ్రీ వై-ఫై వాడుకోవడానికి చాలా అనుకూలంగా అనిపించినప్పటికీ పబ్లిక్ Wi-Fiని ఉపయోగించడం వల్ల మీ పర్సనల్ సమాచారం ఇంకా ఫైనాన్షియల్ డేటా తీవ్రమైన ప్రమాదంలో పడొచ్చు. ఈ విషయంలో ప్రభుత్వం గట్టి హెచ్చరిక కూడా జారీ చేసింది. ప్రజలు పర్సనల్ డేటాను రక్షించుకోవడానికి మని ట్రాన్సక్షన్స్ వంటి సున్నితమైన పనుల కోసం పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌లను ఉపయోగించకుండా ఉండాలని కూడా కోరింది.

are you using free public wifi Indian government warns not to use for financial transactions

పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌లకు ఎక్కువగా సరైన సెక్యూరిటీ ఉండదు. దీని వల్ల హ్యాకర్లు ఇంకా మోసగాళ్లకు మంచి టార్గెట్గ మారుతున్నాయి. డిజిటల్ సెక్యూరిటీ గురించి అవగాహన పెంచడానికి CERT-In దీనిపై ఒక రిమైండర్ జారీ చేసింది. ఇది 'జాగృక్త దివస్' అవేర్ నెస్ క్యాంపైన్లో ఒక భాగం. పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌ల ద్వారా బ్యాంకింగ్ లేదా ఆన్‌లైన్ షాపింగ్ వంటి సున్నితమైన లావాదేవీలు చేయకుండా ఉండాలని CERT-In హెచ్చరిస్తుంది. సైబర్ నేరస్థులు పబ్లిక్ వై-ఫైలో అసురక్షిత కనెక్షన్‌లను (unsafe connections) సులభంగా అడ్డగించి యూజర్ల డేటాను దొంగిలిస్తారు. దింతో ఆర్థికంగా నష్టం కూడా సంభవించవచ్చని CERT-In వివరించింది.

ఉచిత Wi-Fi నెట్‌వర్క్‌ల ద్వారా లావాదేవీలు చేయడం లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఎంటర్ చేయవద్దని ప్రభుత్వం ప్రజలను కోరుతుంది. ఆన్‌లైన్ ట్రాన్సక్షన్ అవేర్ నెస్ ప్రచారంలో భాగంగా CERT-In కొన్ని ముఖ్యమైన సెక్యూరిటీ పద్ధతులను కూడా షేర్ చేసింది. తెలియని సోర్సెస్ నుండి వచ్చే లింక్‌లపై క్లిక్ చేయవద్దని, అన్ని ఆన్‌లైన్ అకౌంట్లకు పొడవైన ఇంకా బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలని అంతేకాక ముఖ్యమైన ఫైల్‌లను ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోవాలని కూడా సూచించింది.

ఈ అలవాట్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఇంకా పబ్లిక్ Wi-Fi ద్వారా ఇమెయిల్‌లను చెక్ చేయడం ఇంకా సోషల్ మీడియా అకౌంట్లోకి లాగిన్ అవ్వడం వంటి సాధారణ అక్టీవిటీస్ కూడా ప్రమాదకరమే. మంచి సెక్యూరిటీ కోసం VPN నెట్‌వర్క్‌ ఉపయోగించమని అలాగే బ్రౌజర్‌లలో ఆటోఫిల్ అప్షన్ ఉపయోగించకుండా ఉండాలని సిఫార్సు చేస్తుంది.

CERT-In అనేది భారతదేశంలో సైబర్ సెక్యూరిటీకి బాధ్యత వహించే జాతీయ సంస్థ. ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. CERT-In సైబర్ భద్రతకు సంబంధించిన కేసులలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 ప్రకారం చర్యలు తీసుకుంటుంది. ఈ సంస్థ పనుల్లో సైబర్ నేరాలపై సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం ఇంకా షేర్ చేయడం ఉంటాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+