నేటి కాలంలో క్రెడిట్ కార్డులు డబ్బులకు ఒక అల్టర్నేటివ్ గా మారిపోయింది. కొందరికి ఒక కార్డు ఉంటే మరికొందరికి రెండు మూడు కార్డ్లు ఉంటున్నాయి. ఈ కార్డ్స్ మనకి ఎన్నో సౌకర్యాలు అందిస్తున్నప్పటికీ, చాలామంది తెలియకుండా చేసే కొన్ని చిన్న తప్పులు వల్ల నష్టాలు కలిగిస్తాయి. మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతీసి, ఇంకా భవిష్యత్తులో లోన్ తీసుకోవడానికి కూడా అడ్డంకిగా మారతాయి. క్రెడిట్ కార్డ్ యూజర్లు తరచుగా చేసే 5 తప్పులు ఏంటో తెలుసా...

1. కనీస మొత్తానికే పరిమితం కావడం: చాలామంది క్రెడిట్ కార్డ్ బిల్లు వచ్చినప్పుడు అందులో చూపించిన మొత్తాన్ని మాత్రమే కడుతుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీరు పెండింగ్ మొత్తం పై నెలకు 2.5% నుండి 3.5% వరకు వడ్డీ కట్టాల్సి వస్తుంది. అంటే ఏడాదికి దాదాపు 30-40% వరకు వడ్డీ అన్నమాట. ఈ వడ్డీ భారం మిమ్మల్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా మీ ఫుల్ పెండింగ్ కట్టెల చూసుకోండి.
2. ఏటీఎం నుండి డబ్బు విత్‌డ్రా చేయడం: క్రెడిట్ కార్డుతో ఏటీఎం నుండి డబ్బు తీసుకోని ఉపయోగించడం మంచిది కాదు. చాలామందికి ఈ విషయం తెలియదు. క్రెడిట్ కార్డు ద్వారా డబ్బు విత్‌డ్రా చేస్తే మీరు విత్‌డ్రా చేసిన మొత్తంపై 2.5% నుండి 3% వరకు చార్జెస్ కట్టాల్సి ఉంటుంది. అంతేకాదు డబ్బు తీసుకున్న మొదటి రోజు నుండే వడ్డీ వర్తిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప డబ్బుల కోసం డెబిట్ కార్డు లేదా పర్సనల్ లోన్ వంటి ఇతర మార్గాలను ప్రయత్నించండి.
3. లిమిట్ పూర్తిగా వాడడం: మీ క్రెడిట్ కార్డుకు ఒక లిమిట్ ఉంటుంది. చాలామంది ఈ లిమిట్ పూర్తిగా లేదా దాదాపు పూర్తిగా ఒకేసారి వాడుతుంటారు. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్‌పై ఎఫెక్ట్ పడుతుంది. మీ క్రెడిట్ లిమిట్‌లో మీరు ఎక్కువ శాతం వాడితే ఆర్థికంగా బాధ్యత లేని వ్యక్తిగా బ్యాంకులు పరిగణిస్తాయి. మీ క్రెడిట్ పరిమితిలో కనీసం 30% కంటే తక్కువ ఉపయోగించకుండ ఉండండి.
4. అనవసరమైనవి కొనడం: క్రెడిట్ కార్డు చేతిలో ఉంటే చాలామంది అనవసరమైనవి కొనేస్తూ ఉంటారు. ఆఫర్లు, డిస్కౌంట్లు కనబడగానే కొంటుంటారు. దీనివల్ల మీ ప్రతినెల బిల్లు పెరుగుతుంది, ఆర్థిక భారం ఎక్కువవుతుంది. ఒక బడ్జెట్ వేసుకొని కేవలం అవసరమైన వస్తువులను మాత్రమే క్రెడిట్ కార్డు ద్వారా కొనేల చూసుకోండి.
5. బిల్లు లేటుగా కట్టడం: మీకు క్రెడిట్ కార్డ్ బిల్లు లేటుగా కట్టే అలవాటు ఉంటే మీరు భారీగా పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. లెట్ ఫీజులు, ఎక్కువ వడ్డీ రేట్లు, ముఖ్యంగా మీ క్రెడిట్ స్కోర్‌పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఇలాంటి సమస్యలను నివారించడానికి మీ బిల్లు టైంకి కట్టెల ఆటో-పేమెంట్ ఆప్షన్‌ను సెట్ చేసుకోండి లేదా మీ క్యాలెండర్‌లో రిమైండర్ సెట్ చేసుకోండి.
మీ క్రెడిట్ కార్డును కొంచెం అలోచించి ఉపయోగించండి. మీరు ఎక్కువగా వాడని కార్డులు ఉంటే వాటిని క్లోజ్ చేయడం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు ఇన్ యాక్టీవ్ కార్డులపై కూడా ఛార్జీలు వర్తించే అవకాశం ఉంది. మీ క్రెడిట్ స్కోర్ ఎప్పటికప్పుడు తప్పకుండా చెక్ చేస్తూ ఉండండి అలాగే మీ కార్డు జారీ చేసిన సంస్థ నిబంధనలు, షరతులను పూర్తిగా తెలుసుకోండి.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications