రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కేవలం రూ.5వేల పెట్టుబడితో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి తర్వాత స్టాక్ మార్కెట్ నుండి భారీగా డబ్బు సంపాదించారని తరచుగా మీరు వినే ఉంటారు. నిజానికి స్టాక్ మార్కెట్లో ఈజీగా డబ్బు సంపాదించవచ్చని అందరూ అనుకుంటారు, అయితే ఇది సాధ్యమే కానీ చాలా మంది పెట్టుబడిదారులు నష్టాలను చూసిన తర్వాత ఎందుకు స్టాక్ మార్కెట్ నుండి వైదొలగుతారు ? దీని వెనుక కారణం అది వారి స్వంత తప్పు.
నిజానికి, స్టాక్ మార్కెట్లో తప్పులను సరిదిద్దడం సులభం. మీరు కూడా కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించవచ్చు. కానీ ఎక్కువగా ప్రజలు డబ్బు సంపాదించే రేసులో నియమాలను, నష్టాలను మరచిపోతారు లేదా ఉద్దేశపూర్వకంగా వాటిని వదిలేస్తారు, తరువాత స్టాక్ మార్కెట్లో నష్టాపోయామని ఫిర్యాదు చేస్తారు.

90 శాతం కంటే ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ నుండి డబ్బు సంపాదించలేకపోతున్నారనేది చేదు నిజం, ప్రతి పెట్టుబడిదారుడు స్టాక్ మార్కెట్‌లోకి అడుగు పెట్టే ముందు ఈ లెక్కలు గుర్తుంచుకోవాలి. కానీ ఇందులో ఒక మంచి విషయం ఏమిటంటే 10 శాతం పెట్టుబడిదారులు డబ్బు సంపాదించడంలో విజయవుతున్నారు. ఎందుకంటే వారు ఈ రూల్స్ పాటిస్తారు కాబట్టి.
1. ఎలా స్టార్ట్ చేయాలి: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి? స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది? స్టాక్ మార్కెట్ నుండి ప్రజలు డబ్బు ఎలా సంపాదిస్తారు? ఎందుకంటే స్టాక్ మార్కెట్ డబ్బు సంపాదించే మెషిన్ కాదు. ఈ డిజిటల్ యుగంలో మీరు ఇంట్లో కూర్చొని కూడా ఆన్‌లైన్‌లో షేర్ మార్కెట్ సమాచారాన్ని పొందవచ్చు. ఇది కాకుండా, మీరు పెట్టుబడి పై ఆర్థిక సలహాదారుడి సహాయం కూడా తీసుకోవచ్చు.
2. తక్కువ మొత్తంతో పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేయండి: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి పెద్ద మొత్తం అవసరం లేదు. చాలా మంది తప్పు చేసేది ఏంటంటే ఉన్న సేవింగ్స్ మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతుంటారు, కానీ మార్కెట్‌లో చోటు చేసుకునే హెచ్చుతగ్గులను భరించలేరు. అందువల్ల, మీరు చిన్న మొత్తంతో అంటే కేవలం 5000 రూపాయలతో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు.
3. టాప్ కంపెనీలను సెలెక్ట్ చేసుకోండి: మొదట్లో చాలా ఎక్కువ లాభం పొందేందుకు ఉచ్చులో పడకండి. ఎందుకంటే ఎక్కువ రాబడి కోసం ప్రజలు బలంగా లేని కంపెనీల స్టాక్‌లలో డబ్బు పెట్టుబడి పెట్టి, ఆ తర్వాత చిక్కుకుపోతారు. అందువల్ల, ఎల్లప్పుడూ బలంగా ఉన్న బ్లూ చిప్ కంపెనీలతో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించండి. మీకు కొన్ని సంవత్సరాల అనుభవం వాచ్చాక మీరు కొంత రిస్క్ తీసుకోవచ్చు.
4. పెట్టుబడి పెట్టడం కొనసాగించాల్సిన అవసరం: మీరు చిన్న మొత్తంతో పెట్టుబడి పెట్టడం ప్రారంభించి క్రమంగా పెట్టుబడిని పెంచుతూ ఉండండి. మీ పోర్ట్‌ఫోలియోను బ్యాలెన్స్ గా ఉంచండి. మీరు కొన్ని సంవత్సరాలు నిరంతరం మార్కెట్లో పెట్టుబడి పెట్టినప్పుడు, మీరు టార్గెట్ సాధించగలరు. ఎక్కువగా మార్కెట్లో ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టేవారు ప్రయోజనం పొందుతారు.
5. పెన్నీ షేర్లకు దూరంగా ఉండండి: పెట్టుబడిదారులు తరచుగా తక్కువగా ఉన్న స్టాక్‌లపై దృష్టి పెడతారు. ప్రజలు ఎటువంటి కారణం లేకుండా రూ. 10-15 విలువైన స్టాక్‌లను కొనుగోలు చేసి, ధరలు పడిపోయినప్పుడు ఆందోళన చెందడం ప్రారంభిస్తారు. చౌక షేర్లలో తక్కువ పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ సంపాదించవచ్చని కూడా భావిస్తారు. కానీ ఈ ఆలోచన తప్పు. కంపెనీ వృద్ధిని చూసి ఎల్లప్పుడూ స్టాక్‌లను సెలెక్ట్ చేసుకోండి. వ్యాపారం బాగుండి అలాగే ఆ వ్యాపారాన్ని నడిపే యాజమాన్యం బాగుండే కంపెనీలో మాత్రమే పెట్టుబడి పెట్టండి.
6. షేర్స్ పడిపోయినపుడు భయపడకండి: స్టాక్ మార్కెట్‌లో పతనం జరిగినప్పుడల్లా భయపడకండి, కానీ దానిని పెట్టుబడి అవకాశంగా ఉపయోగించుకోండి. తరచుగా పెట్టుబడిదారులు డబ్బు సంపాదించినంత కాలం పెట్టుబడి పెడుతూనే ఉంటారు. కానీ మార్కెట్ పడిపోవడం పెరగడంతో పెట్టుబడిదారులు భయపడుతుంటారు. భారీ నష్టాల భయంతో తక్కువ ధరకే షేర్లను అమ్ముతారు. పెద్ద పెట్టుబడిదారులు షేర్స్ కొనడానికి మార్కెట్ కోసం చూస్తుంటారు.
7. మీ సంపాదనలో కొంత భాగాన్ని సురక్షిత పెట్టుబడులలో పెట్టుబడి పెట్టండి: స్టాక్ మార్కెట్ నుండి మీ సంపాదనలో కొంత భాగాన్ని సురక్షిత పెట్టుబడులలో పెట్టుబడి పెట్టండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మీ లాభాలను క్యాష్ చేసుకుంటారు. ప్రతి పెట్టుబడిదారుడికి అతి ముఖ్యమైన ఇంకా కీలకమైన విషయం ఏమిటంటే, అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్‌కు దూరంగా ఉండటం అండ్ పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక సలహాదారుడి సహాయం తీసుకోవడం. దేశంలోని పెద్ద పెట్టుబడిదారులను అనుసరించడం అలాగే వారి మాటలను తీవ్రంగా పరిగణించండి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications