చాలా మంది కొత్త పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి టాప్ మ్యూచువల్ ఫండ్స్ కోసం చూస్తారు. చాలా మందికి సరైన అవగాహన లేక పెట్టుబడులు పెడుతుంటారు. అయితే మంచి రాబడి ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఏమిటో చూద్దాం. అగ్రెసివ్ హైబ్రిడ్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లలో మంచి రిటర్స్ ఇచ్చే వాటిని చూద్దాం. లార్జ్ క్యాప్ కేటగిరిలో కెనరా రోబెకో బ్లూచిప్ ఈక్విటీ ఫండ్, మిరే అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ ఉన్నాయి. ఫ్లెక్సీ క్యాప్ విషయానికొస్తే పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, యూటీఐ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉన్నాయి.
యాక్సిస్ మిడ్‌క్యాప్ ఫండ్, కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ కూడా మంచి రిటర్స్ ఇస్తున్నాయి నిపుణులు చెబుతున్నారు. స్మాల్ క్యాప్ లో యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్,SBI స్మాల్ క్యాప్ ఫండ్ ఉన్నాయి. హైబ్రిడ్ ఫండ్లలో SBI ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్, మిరే అసెట్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ ఉన్నాయి. ఈ ఫండ్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లలోకి కొత్తగా వచ్చిన వారికి అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్లుఅనువైనవిగా చెబుతున్నారు.

ఈ ఫండ్లు ఈక్విటీ (65-80%), డెట్ (20-35శాతం) పెట్టుబడి పెడతాయి. ఈ హైబ్రిడ్ పోర్ట్‌ఫోలియో కారణంగా అవి ఫ్యూర్ ఈక్విటీ పథకాల కంటే తక్కువ అస్థిరమైనవిగా ఉంటాయి. ఎక్కువ అస్థిరత లేకుండా దీర్ఘకాలిక సంపదను సృష్టించాలని చూస్తున్న చాలా సంప్రదాయవాద ఈక్విటీ పెట్టుబడిదారులకు అగ్రెసివ్ హైబ్రిడ్ పథకాలు ఉత్తమ పెట్టుబడి మార్గంగా ఉంటాయని చెబుతున్నారు. కొంతమంది ఈక్విటీ ఇన్వెస్టర్లు స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు తమ డబ్బు సురక్షితంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారికి లార్జ్ క్యాప్ ఫండ్స్ మంచివని చెబుతున్నారు.
ఈ ఫండ్స్ టాప్ 100 స్టాక్‌లలో పెట్టుబడి పెడతాయి. అవి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్కీమ్‌ల కంటే ఎక్కువ అస్థిరతను కలిగి ఉంటాయి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలని చూస్తున్న సాధారణ ఈక్విటీ ఇన్వెస్టర్లలు ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ సరిపోతాయని వివరించారు.
Note: ఈ సమాచారం కేవలం నిపుణుల అభిప్రాయం మాత్రమే. దీనికి గుడ్ రిటర్స్ తెలుగుకు సంబంధం లేదు.


Click it and Unblock the Notifications