Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా..!
ఈక్విటీల్లో చాలా మంది మార్కెట్ పెరిగేటప్పుడు పెట్టుబడి పెడతారు. కానీ.. మార్కెట్ పడినప్పుడు పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే వారు మార్కెట్ పడిపోతూ ఉంటే.. భయపడి బయటకు వస్తుంటారు. కానీ.. పెట్టుబడికి ఇదే అనుకూల సమయమని నిపుణులు వివరిస్తున్నారు. సిప్ రూపంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి రాబడి పొందే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే గత మూడేళ్లలో అత్యుత్తమ రాబడి ఇచ్చిన మ్యూచువల్ ఫండ్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
గత మూడేళ్లలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన మూడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 25 శాతం కంటే ఎక్కువ రాబడిని సాధించాయి. ఈ ఫండ్లకు సంబంధించిన AUM (నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ), వ్యయ నిష్పత్తి, రేటింగ్ వివరాలు పరిశీలిద్దాం. గత మూడేళ్లలో ఐటీఐ స్మాల్ క్యాప్ ఫండ్ అత్యధికంగా 25.31% రాబడిని అందించింది. ఈ ఫండ్ AUM రూ. 3,454 కోట్లుగా ఉంది. దీనికి ఫైవ్-స్టార్ రేటింగ్ లభించింది, దీని వ్యయ నిష్పత్తి 0.86%గా ఉంది. బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ గత మూడేళ్లలో 25.26% రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ AUM రూ. 31,103 కోట్లుగా ఉంది. దీనికి ఫైవ్-స్టార్ రేటింగ్ ఉంది.
దీని వ్యయ నిష్పత్తి 0.61%గా ఉంది.

యూటీఐ హెల్త్‌కేర్ ఫండ్ గత మూడేళ్లలో 25.04% రాబడిని అందించింది. ఈ ఫండ్ AUM రూ. 14,433 కోట్లుగా ఉంది. దీనికి ఫోర్-స్టార్ రేటింగ్ లభించింది. దీని వ్యయ నిష్పత్తి 1.33%గా ఉంది. HSBC మిడ్‌క్యాప్ ఫండ్ గత మూడేళ్లలో సుమారు 21.6% అత్యధిక వార్షిక రాబడి అందించింది. ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ గత మూడేళ్లలో 20.9% వార్షిక రాబడి అందించింది. ఈ ఫండ్‌కు ఫోర్-స్టార్ రేటింగ్ లభించింది. ఆగస్టు 2026 నాటికి దీని AUM రూ. 14,721 కోట్లుగా ఉంది. వైట్‌ఓక్ క్యాపిటల్ మిడ్ క్యాప్ ఫండ్ గత మూడేళ్లలో 19.3 శాతం, ICICI ప్రుడెన్షియల్ మిడ్‌క్యాప్ ఫండ్ 19.1% వార్షిక రాబడులను అందించాయి.
వైట్‌ఓక్ క్యాపిటల్ మిడ్ క్యాప్ ఫండ్కు ఫైవ్-స్టార్ రేటింగ్ లభించింది. ఆగస్టు 2026 నాటికి దీని AUM రూ. 7,485 కోట్లుగా ఉంది. ఎడెల్‌వైస్ మిడ్ క్యాప్ ఫండ్ గత మూడేళ్లలో దాదాపు 18.4 శాతం రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్‌కు ఫోర్-స్టార్ రేటింగ్ ఉండగా..దీని నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (AUM) రూ. 19,891 కోట్లుగా ఉంది. టారస్ మిడ్ క్యాప్, ఎస్‌బీఐ మిడ్ క్యాప్, క్వాంట్ మిడ్ క్యాప్, పిజిఐఎం ఇండియా మిడ్ క్యాప్, యుటిఐ మిడ్ క్యాప్ వంటి మరో ఐదు ఫండ్లు 8.1% నుండి 9.9% మధ్య రాబడులను అందించాయి. అయితే గత రాబడిని బట్టి పెట్టుబడులపై నిర్ణయం తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
