ఈ మధ్య మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడులు పెరుగుతోన్నాయి. ముఖ్యం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే మీరు పెట్టుబడి పెట్టే ఫండ్ ఫర్మామెన్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. వైట్‌ఓక్ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్ దీనికి సంబంధించి నిర్వహించిన అధ్యయనంలో సిప్ పెట్టుబడికి సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
గత 19 ఏళ్లలో స్మాల్‌క్యాప్ ఇండెక్స్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లో చేసిన సిప్ లు లార్జ్ క్యాప్ ఇండెక్స్ కంటే మెరుగైన రాబడిని ఇచ్చాయని ఈ అధ్యయనం తేలింది. అయితే, గత 19 ఆర్థిక సంవత్సరాల్లో, లార్జ్‌క్యాప్ విభాగంలోని సిప్ లు ఏడు రెట్లు అధిగమించగా, స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లోని సిప్ లు ఆరు రెట్లు అధిగమించాయి.

ఒక ఇన్వెస్టర్ గత సంవత్సరం అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ఇండెక్స్‌కు మారే బదులు మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లో పెట్టుబడిని కొనసాగించినట్లయితే, అతను ఏప్రిల్ 1, 2024 వరకు 18.8 శాతం వార్షిక రాబడిని పొందాడు. కాగా, ఇండెక్స్‌ను మార్చిన తర్వాత కేవలం 15.5 శాతం రాబడి మాత్రమే పొందగలిగాగడు. ఒక పెట్టుబడిదారు స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లో SIPని ప్రారంభిస్తే, అతను 16 శాతం వార్షిక రాబడిని పొందుతాడు. ఇండెక్స్‌ను మార్చినప్పుడు రాబడి 15.1 శాతం మాత్రమే.
మీరు 10 సంవత్సరాల రోలింగ్ SIP రిటర్న్‌లను పరిశీలిస్తే, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లో నిరంతర సిప్ 16.6 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లో ప్రారంభమై గత ఏడాది అత్యుత్తమ పనితీరు సూచీకి మారిన వారికి 14.5 శాతం మాత్రమే రాబడి వచ్చింది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లో సిప్ సగటు రాబడి 14 శాతంగా ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications