బంగారం నగలే మాత్రమే కాదు ఎంతో ఉపయోగపడే ఆస్తి కూడా. కష్ట సమయాల్లో డబ్బు అవసరమైనప్పుడు బంగారాన్ని పెట్టుబడిగా ఉపయోగించవచ్చు. సాధారణంగా గోల్డ్ లోన్ అని పిలువబడే బంగారం పెట్టుబడి చాలా మందికి ఆర్థిక అవసరాలను తీరుస్తుంటుంది. గోల్డ్ లోన్ ద్వారా ఎవరైనా వారి బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బు ఏర్పాటు చేసుకోవచ్చు.
మీరు కూడా కొన్ని కారణాల వల్ల గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నట్లయితే ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆత్రుతతో లేదా తొందరలో గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు ఎదురవవచ్చు. గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు ఎలాంటి విషయాలు గుర్తుంచుకోవాలో తెలుసా...

మీ అవసరాలను అర్థం చేసుకోండి: గోల్డ్ లోన్ తీసుకునే ముందు మీ అవసరాలను ఒకసారి పరిగణించండి. కష్ట సమయాల్లో మాత్రమే గోల్డ్ లోన్ తీసుకోండి. బట్టలు, కారు లేదా ప్రయాణం వంటి మీ చిన్న చిన్న అవసరాల కోసం గోల్డ్ లోన్ తీసుకోకండి. అంతే కాకుండా, మీరు డబ్బు చెల్లించిన తర్వాత మీ బంగారాన్ని తిరిగి సొంతం చేసుకునేటట్టు చూసుకోండి. వడ్డీకి సంబంధించి ప్రతినెల లేదా 3 నెలల లేదా ఏడాదికి ఎంత కట్టాలో తెలుకోవడం మంచిది.
ప్రభుత్వ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లు, ప్రయివేట్ బ్యాంకులు అందించే గోల్డ్ లోన్‌లపై వివిధ ప్రదేశాలలో బంగారు రుణాల వడ్డీ రేట్లు తెలుసుకోండి. బంగారు రుణాలు సాధారణంగా బ్యాంకులలో తక్కువ వడ్డీ రేట్లకు లభిస్తాయి. NBFCలో ఎక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇస్తుంటారు. ఇలాంటి పరిస్థితిలో రుణం తీసుకునే ముందు అన్ని ప్రదేశాల నుండి వడ్డీ రేట్లను చెక్ చేయండి ఇంకా బ్యాంక్ లేదా NBFCలో ఏది బెస్ట్ అని తెలివిగా సలెక్ట్ చేసుకొండి.
ఈ సమాచారం చాలా ముఖ్యం: గోల్డ్ లోన్ తీసుకునే ముందు, మీరు లోన్ తిరిగి చెల్లించలేకపోతే మీ బంగారాన్ని బ్యాంక్ అధికారులు ఎం చేస్తారో తెలుసుకోండి. సాధారణంగా గోల్డ్ లోన్ రీపేమెంట్ వ్యవధి 3 నెలల నుండి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. అందుకే బంగారంని వృధాగా పెట్టుబడి పెట్టడం కాకుండా మీరు మీ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా లోన్ రీపేమెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
అయితే సాధారణంగా కొన్ని బ్యాంకులు మీరు తీసికున్న గోల్డ్ లోన్ తిరిగి టైంకి చెల్లించకపోతే బ్యాంక్లు మీకు లోన్ రికవరీకి ముందస్తు నోటీసులు జారీ చేయవచ్చు ఒకవేళ గోల్డ్ లోన్ పూర్తిగా చెల్లించకపోతే ఈ తాకట్టు పెట్టిన బంగారంని వేలం వేసి డబ్బు రికవరీ చేసేందుకు చర్యలు తీసుకోవచ్చు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications