సామాన్యుడిని ఎడిపిస్తున్న బంగారం వెండి.. ధరలు ఆగేదేలే తగ్గేదేలే.. 3 వేలు పెరిగిన పసిడి..
ఈ వాలెంటైన్స్ డేకి షాపింగ్ చేసే వారికీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వాలెంటైన్స్ వీక్ సందర్భంగా మీ ఇష్టమైన వారికీ గోల్డ్ జ్యువెలరీ లేదా బంగారం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆలోచించాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం బంగారం ధరలు రోజురోజుకు రికార్డులు బ్రేక్ చేసుకుంటూ కొత్త రికార్డ్ సృష్టిస్తున్నాయి. ఒక పక్క వాలెంటైన్స్ డే రాబోతుండగా మరో పక్క పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. షాపింగ్ ప్రియులు బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తున్న వారికీ నిరాశే ఎదురవుతుంది. పసిడి ధర ప్రతిరోజు మారుతుందని మీకు తెలిసిందే. ఇందుకు అనేక కారణాలు ఉంటాయని చెప్పవచ్చు.
1 గ్రాము ధర :
22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ. 35 పెరిగి రూ.7,980, 24 క్యారెట్ల బంగారం 1గ్రాము ధర రూ.39 పెరిగి రూ.8,706,18క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ. 28 పెరిగి రూ.6,529.

10 గ్రాముల ధర :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.79,450 నేడు రూ.350 పెరిగి రూ.79,800 చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు నిన్న రూ.87,060 నేడు రూ.390 పెరిగి రూ.86,670గా ఉండగా 18 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.65,290 ఇవాళ రూ.280 పెరిగి రూ.65,010.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు చూస్తే:
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.79,800 24 క్యారెట్ల ధర రూ.87,060, 18 క్యారెట్ల ధర రూ.65,290
విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.79,800 24 క్యారెట్ల ధర రూ.87,060, 18 క్యారెట్ల ధర రూ.65,290
అమరావతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.79,800 24 క్యారెట్ల ధర రూ.87,060, 18 క్యారెట్ల ధర రూ.65,290
గుంటూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.79,800 24 క్యారెట్ల ధర రూ.87,060, 18 క్యారెట్ల ధర రూ.65,290
నెల్లూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.79,800 24 క్యారెట్ల ధర రూ.87,060, 18 క్యారెట్ల ధర రూ.65,290
కాకినాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.79,800 24 క్యారెట్ల ధర రూ.87,060, 18 క్యారెట్ల ధర రూ.65,290
తిరుపతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.79,800 24 క్యారెట్ల ధర రూ.87,060, 18 క్యారెట్ల ధర రూ.65,290
కడపలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.79,800 24 క్యారెట్ల ధర రూ.87,060, 18 క్యారెట్ల ధర రూ.65,290
అనంతపురంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.79,800 24 క్యారెట్ల ధర రూ.87,060, 18 క్యారెట్ల ధర రూ.65,290
ఈ నెల 1 ఫిబ్రవరి రోజున 22 క్యారెట్ల ధర రూ.77450, 24 క్యారెట్ల ధర రూ.84,490గా ఉంది. అయితే ఇవాళ చూస్తే 22 క్యారెట్ల ధర రూ.79,800, 24 క్యారెట్ల ధర రూ.87,060. వెండి ధర చూస్తే కేజీకి రూ.1,07,000గా ఉంది.
శుక్రవారం రికార్డు స్థాయిలో $2,886.62కి చేరిన తర్వాత 0005 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.3 శాతం పెరిగి $2,868.66 వద్ద ఉంది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు $31.82 వద్ద స్థిరంగా ఉంది. ప్లాటినం 0.3 శాతం తగ్గి $973.60 వద్ద ఉంది. పల్లాడియం 0.4 శాతం పెరిగి $968.29 వద్ద ఉంది.
బంగారం కొనాలనుకుంటున్నారా ? స్వచ్ఛతను ఎలా చెక్ చేయాలి ?
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) హాల్ మార్కులను ఇస్తుంది. 24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది, 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999 అని, 23 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 958 అని, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 916 అని, 21 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 875 అని, 18 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 750 అని రాసి ఉంటుంది.
22 క్యారెట్ల బంగారంలో రాగి, వెండి, జింక్ వంటి 9% ఇతర లోహాలను కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారంలో కల్తీ ఉండదు, కానీ 24 క్యారెట్ల బంగారంతో ఆభరణాలు తయారు చేయలేరు, అందుకే చాలా మంది దుకాణదారులు 18, 20 ఇంకా 22 క్యారెట్ల బంగారాన్ని అమ్ముతుంటారు.


Click it and Unblock the Notifications