మదర్స్ డేకి గిఫ్ట్ ఇస్తున్నారా.. ఫోన్, చీర కంటే ఇదే గొప్ప గిఫ్ట్ !
మే 11న మదర్స్ డే రాబోతోంది. ఈ మదర్స్ డే రోజు మీ అమ్మకు చీర లేదా నగలు కొని ఇవ్వడం కంటే ఆమె భవిష్యత్తుకు భద్రత కల్పించే గిఫ్ట్ ఇవ్వండి. ఎందుకంటే నేటి ప్రపంచంలో పెట్టుబడి బహుమతి ప్రతి ఒక్క తల్లికి అత్యంత తెలివైన బహుమతి కావచ్చు. అయితే ఈ మదర్స్ డే రోజున మీ తల్లి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్ అప్షన్ ఉత్తమం. మీరు మీ తల్లి పేరు మీద FD ఓపెన్ చేయడం ద్వారా మీరు ఆమె వృద్ధాప్యాన్ని కాపాడుకోవచ్చు.

ఈ రోజుల్లో మదర్స్ డేను అందరు చాలా ఘనంగా జరుపుకుంటుంటారు. ప్రతి సంవత్సరం మే నెల రెండవ వారంలో మదర్స్ డే వస్తుంది. కాబట్టి ఈసారి మదర్స్ డేని ప్రత్యేకంగా చేయడానికి మీరు మీ తల్లి పేరు మీద కొన్ని పెట్టుబడులు స్టార్ట్ చేయవచ్చు. కాబట్టి మీరు ఈ మదర్స్ డేకి మీ తల్లి పేరు మీద పెట్టుబడి పెట్టబోతున్నట్లయితే, మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) అప్షన్ ముందుగా పరిగణించవచ్చు. ఇందుకు మీరు మీ తల్లి పేరు మీద ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసు ద్వారా FD తెరవవచ్చు.
చాల మంది ఈ రోజుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లను సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. అలాగే మీరు మీ తల్లికి సురక్షితమైన భవిష్యత్తును ఇవ్వాలనుకుంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం మంచి అప్షన్ కావచ్చు. మీరు మీ తల్లి పేరు మీద FD చేస్తే మంచి వడ్డీతో పాటు ఎన్నో ఇతర ప్రయోజనాలు పొందవచ్చు.
మీ తల్లి వయస్సు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, అంటే ఆమె సీనియర్ సిటిజన్ల లిస్టులో చేరితే ఆమె పేరు మీద FD చేస్తే ఆమెకు దాదాపు 0.50 శాతం ఎక్కువ లాభం లభిస్తుంది. ఒకవేళ మీ తల్లి సూపర్ సీనియర్ సిటిజన్ లిస్టులో ఉంటే ఆమెకు దాదాపు 0.75 నుండి 0.80 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు ప్రతి బ్యాంకులో FD వడ్డీ రేటు వేరేలా ఉంటుందని గుర్తుంచుకోవాలి. FD నుండి వచ్చే ఆదాయంపై TDS (Tax Deducted at Source) కట్ అవుతుంది. మీ తల్లి పేరు మీద ఉన్న FDల నుండి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50 వేల కంటే ఎక్కువ వడ్డీ ఆదాయంపై 10% TDS కోత విధిస్తారు.
మీరు మీ తల్లి పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెడితే మీరు ఎక్కువ వడ్డీ పొందడమే కాకుండా మీ పన్నులను కూడా ఆదా చేసుకోవచ్చు. మీ తల్లి సీనియర్ సిటిజన్ అయి, ఎలాంటి ఆదాయం లేకుంటే లేదా తక్కువ పన్ను పరిధిలోకి వస్తే దీనివల్ల కూడా చాల ప్రయోజనాలు ఉంటాయి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.


Click it and Unblock the Notifications