Stock Market: న్యూఇయర్ రోజు స్టాక్ మార్కెట్లకు సెలవా? NSE-BSE అందుబాటులో ఉండవా..?
Stock Market Holiday: మరికొన్ని గంటల్లో 2024 ముగిసిపోతోంది. రేపటి నుంచి 2024 ఒక కలలాగా దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల జర్నీలో మిగిలిపోనుంది. వాస్తవానికి పెట్టుబడిదారులకు 2024లో కొనసాగిన బుల్ ర్యాలీ మంచి రాబడులను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో కొత్త సంవత్సరం మార్కెట్ల ప్రయాణం ఎలా ఉండనుందనే ఆందోళన అందరిలోనూ ఉన్న సంగతి తెలిసిందే.
అయితే దేశీయంగా స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు చాలా గందరగోళంలో ఉన్నారు. జనవరి 1, 2025న దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ కోసం అందుబాటులో ఉంటాయా? ఉండవా? అనే అనుమానంలో ఉన్నారు. చాలా మంది తమ కొత్త సంవత్సరం రెజల్యూషన్లలో భాగంగా పెట్టుబడులకు సంబంధించి కూడా కీలక ప్రయాణాన్ని కొత్త ఏడాది మెుదటి రోజు నుంచే ప్రారంభించటం వల్ల అందరి దృష్టి దీనిపైనే ఉంది. నేడు వాస్తవానికి స్టాక్ మార్కెట్లు పెట్టుబడిదారులకు అందుబాటులో ఉన్న వేళ ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు రానున్న సంవత్సరంలో మెుదటి రోజున ట్రేడింగ్ కోసం అందుబాటులో ఉంటాయా లేదా అనే విషయంపై వాటి క్యాలెండర్ చూసి గ్రహించవచ్చు.

NSE-BSE సెలవుల క్యాలెండర్ పరిశీలిస్తే జనవరి 1, 2025 స్టాక్ మార్కెట్లకు వర్కింగ్ డే అని వెల్లడైంది. అలాగే జనవరిలో దేశీయ స్టాక్ మార్కెట్లకు ఎలాంటి సెలవులు అధికారికంగా లేవని వెల్లడైంది. కేవలం వారాంతపు సెలవుల రోజున మాత్రమే స్టాక్ మార్కెట్లు మూతపడి ఉండనున్నాయి. ఈ క్రమంలో చాలా మంది స్టాక్ మార్కెట్ల సెలవుల గురించి గమనిస్తున్నారు. ఇదే క్రమంలో అక్టోబర్ 21, 2025న ప్రత్యేకంగా దీపావళికి జరిపే ముహురత్ ట్రేడింగ్ ఒక గంట పాటు కొనసాగుతుందని తెలుస్తోంది.
2025లో భారతీయ స్టాక్ మార్కెట్ అధికారిక సెలవుల వివరాలు..
- ఫిబ్రవరి 26 మహా శివరాత్రి
- మార్చి 14 హోలీ
- మార్చి 31 రంజాన్
- ఏప్రిల్ 10 మహావీర్ జయంతి
- ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి
- ఏప్రిల్ 18 గుడ్ ఫ్రైడే
- మే 1 మహారాష్ట్ర దినోత్సవం
- ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం
- ఆగస్టు 27 గణేష్ చతుర్థి
- అక్టోబర్ 2 గాంధీ జయంతి, దసరా
- అక్టోబర్ 21 దీపావళి
- అక్టోబర్ 22 దీపావళి బలిపత్ర
- నవంబర్ 5 గురునానక్ జయంతి
- డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ
శనివారం స్పెషల్ ట్రేడింగ్..
వాస్తవానకి ప్రతి ఏటా ఫిబ్రవరి 1, 2025న పార్లమెంటులో కేంద్రం తన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే రోజు. అయితే ఈ సారి ఫిబ్రవరి 1 శనివారం రావటంతో ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడానికి కుదరటం లేదు. బడ్జెట్ ప్రకటనల ప్రకారం పెట్టుబడులు తీసుకునే నిర్ణయాలు ఎకానమీ పరిస్థితులను ప్రతిబంబిస్తాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు ట్రేడింగ్ చేసుకోవటానికి స్టాక్ మార్కెట్లను ప్రత్యేకంగా పనిచేసే విధంగా కీలక నిర్ణయం రావటంతో అందరిలోనూ కోలాహలం కొనసాగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి చేసే ప్రతి ప్రకటన ఆయా రంగాల్లోని కంపెనీల షేర్లపై ప్రభావాన్ని చూపటం ఏటా మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ఈ సారి బడ్జెట్ ప్రసంగం రోజున నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ బడ్జెట్ సమర్పించబే ఫిబ్రవరి 1, 2025న స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్‌కు తెరవబడతాయని ప్రకటించబడింది.


Click it and Unblock the Notifications