For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Archean Chemical IPO: అదరగొడుతున్న ఆర్కియన్ కెమికల్స్.. లిస్టింగ్ ముందే దూకుడు..

|

Archean Chemical IPO: కరోనా వచ్చిన తర్వాత చాలా కెమికల్ కంపెనీలు వేగంగా వృద్ధి చెందటం ప్రారంభించాయి. ఈ క్రమంలో వాటి షేర్ల ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే ఇదే రంగంలో వ్యాపారం చేస్తున్న ఆర్కియన్ కెమికల్స్ కంపెనీ ఐపీవోగా లిస్ట్ కాబోతోంది. అయితే మార్కెట్లోకి రాకముందే ఈ స్టాక్ తన దూకుడుతో రికార్డులు సృష్టిస్తోంది.

ఇన్వెస్టర్ల స్పందన..

ఇన్వెస్టర్ల స్పందన..

స్పెషాలిటీ కెమికల్స్ మేకర్ ఆర్కియన్ కెమికల్ ఐపీవోలో షేర్ల కేటాయింపు ఖరారైంది. ఇప్పుడు అందరి దృష్టి షేర్ల లిస్టింగ్‌పైనే ఉంది. కెమికల్ కంపెనీ IPO మార్కెట్లో అధిక స్పందనను పొందింది. 32.23 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. గ్రే మార్కెట్‌లో కంపెనీ షేర్లకు కూడా బలమైన స్పందన కనిపించటం దీనిని రుజువు చేస్తోంది. ఆర్కియన్ కెమికల్ షేర్ల గ్రే మార్కెట్ ప్రీమియం(GMP) నిరంతరం పెరుగటం దానిపై ఆసక్తిని మరింతగా పెంచుతోంది.

గ్రే మార్కెట్ పరుగులు..

గ్రే మార్కెట్ పరుగులు..

ఆర్కియన్ కెమికల్ గ్రే మార్కెట్ ప్రీమియం ప్రస్తుతం రూ.112కి చేరుకుంది. దీంతో మార్కెట్ నిపుణులతో పాటు అనేకమంది రిటైలర్లను సైతం ఈ ఐపీవో ఆకర్షిస్తోంది. అయితే ఈ ఐపీవో సోమవారం అంటే నవంబర్ 21న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కావచ్చని తెలుస్తోంది. ఈ ఐపీవో షేర్ ధర బ్యాండ్ రూ.386-407గా కంపెని నిర్ణయించింది. లిస్టింగ్ సమయంలో స్టాక్ మంచి ప్రీమియం ధరను పొందగలదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంచనాల ప్రకారం ఇది రూ.519 స్థాయిలో లిస్ట్ చేయవచ్చు.

దిగ్గజాల పెట్టుబడి..

దిగ్గజాల పెట్టుబడి..

ఆర్కియన్ కెమికల్ పబ్లిక్ ఇష్యూకి ముందు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.658 కోట్లు సమీకరించింది. కెమికల్ కంపెనీ 16 కోట్ల షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకు రూ.407 చొప్పున ఇప్పటికే కేటాయించింది. కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వాటిలో.. గోల్డ్‌మన్ సాక్స్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, బీఎన్‌పీ పారిబాస్, గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, డీఎస్‌పీ స్మాల్ క్యాప్ ఫండ్, టాటా మ్యూచువల్ ఫండ్, ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్, నిప్పన్ ఇండియా ఎంఎఫ్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి.

షేర్లు పొందిన వారికి పండగే..

షేర్లు పొందిన వారికి పండగే..

ఆర్కియన్ కెమికల్ IPOలో తాజా ఇష్యూతో పాటు ప్రమోటర్ల వాటాలు ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉంది. తాజా ఐపీవో ద్వారా వచ్చే డబ్బును కంపెనీ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల చెల్లింపుల కోసం వినియోగించనుంది. కంపెనీ IPOలో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల కోటా 48.91 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. అయితే నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల భాగం 14.90 రెట్లు సబ్‌స్క్రయిబ్ చేయబడింది. ఐపీఓలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 9.96 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. దీంతో ఐపీవోలో షేర్లు వచ్చిన వారికి పండగని చెప్పుకోవాలి.

English summary

Archean Chemical IPO: అదరగొడుతున్న ఆర్కియన్ కెమికల్స్.. లిస్టింగ్ ముందే దూకుడు.. | Archean Chemical IPO premium was 112 rupees in grey market listing soon

Archean Chemical IPO premium was 112 rupees in grey market listing soon
Story first published: Friday, November 18, 2022, 16:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X