Anakapalli: కూటమి ప్రభుత్వం రోజురోజుకూ పెట్టుబడుల విషయంలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఒకపక్క చంద్రబాబు తన చతురతను ఉపయోగిస్తుండగా.. మరో పక్క మంత్రి నారా లోకేష్ అమెరికాలో దిగ్గజ టెక్ కంపెనీలతో పెట్టుబడులపై చర్చలు జరుపుతున్నారు. ఏపీ ప్రభుత్వం చెప్పినట్లుగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటో వాస్తవంగా చూపిస్తోంది. టీసీఎస్ వైజాగ్ పెట్టుబడి డీల్ కేవలం 40 నిమిషాల్లో జరిగిందని ఇప్పటికే లోకేష్ వెల్లడించటం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
తాజాగా అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి వద్ద రూ.1.5 లక్షల కోట్లతో మెగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు జరగనుంది. ఆర్సెలార్ మిట్టల్- జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్‌ల జాయింట్ వెంచర్ లో భాగంగా ఈ ప్లాంట్ ఏర్పాటు జరుగుతోంది. ఇది AM/NS స్టెయిన్‌లెస్ స్టీల్‌ను ఉత్పత్తి చేస్తుంది. రానున్న కాలంలో ఈ ప్లాంట్ ద్వారా మెుత్తం 70,000 మందికి ప్రక్యక్షంగా-పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు వెల్లడైంది. టీడీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో దేశంలోనే దీనిని అతిపెద్ద పెట్టుబడిగా పేర్కొంది. వచ్చే వారం సమావేశమయ్యే రాష్ట్ర మంత్రివర్గం ఈ ప్రతిపాదనపై చర్చించిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌తో పాటు మొత్తం 17 బెర్త్‌లతో కూడిన కో-టెర్మినస్ క్యాప్టివ్ పోర్ట్ కోసం ప్రతిపాదన వచ్చినట్లు వెల్లడైంది. మెుదటి దశలో ప్లాంట్ 20.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పెట్టుబడికి సంబంధించి AM/NS ప్రతినిధులు రెండు నెలల క్రితం మంత్రి నారా లోకేష్‌ను పెట్టుబడి గురించి చర్చించేందుకు కలిశారు. దీనికి అవసరమైన రోడ్డు రవాణా సదుపాయాలతో పాటు, రైలు కనెక్టివిటీ, నీటి అవసరాలను తీర్చటానికి పోలవరం ప్రధాన కాలువ అందుబాటులో ఉండటంతో వ్యూహాత్మకంగా ప్లాంట్ ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా ఉన్నట్లు నొక్కి చెప్పబడింది.
ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు నక్కపల్లె వద్ద 4500 ఎకరాలు కోరగా ఇప్పటికే 1800 ఎకరాల భూమి తక్షణం అందుబాటులో ఉన్నట్లు వెల్లడైంది. తొలి దశ 2029, రెండవ దశ 2033 నాటికి నిర్మాణం పూర్తి చేసుకుంటాయని తెలుస్తోంది. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోని కిరండూల్ మరియు విశాఖపట్నం ఓడరేవు మధ్య ఇనుప ఖనిజం రవాణాకు ఉపయోగించే ఐరన్ స్లర్రీ పైప్‌లైన్‌ను నక్కపల్లెలోని స్టీల్ ప్లాంట్‌కు విస్తరించనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ పెట్టుబడి ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ఆర్సెలార్ మిట్టల్ సీఈఓతో వీడియో కాల్ చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆదివారం ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్‌తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇదే విషయాన్ని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తన ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా ధృవీకరించారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications