ఆంధ్రప్రదేశ్‌లోని అందమైన అరకు లోయ.. ప్రకృతి అందాలకే కాదు, కాఫీ పంటలకు కూడా ప్రసిద్ధి. ఇక్కడ ప్రపంచంలోనే అత్యుత్తమమైన కాఫీ గింజలు పండుతాయి. అందుకే అరకు కాఫీ చాలా ప్రత్యేకం. దశాబ్దాలుగా అరకు కాఫీకి ప్రత్యేక రుచి ఉన్నప్పటికీ.. సరైన మార్కెటింగ్ లేక ప్రపంచానికి తెలియలేదు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. అరకు కాఫీ బ్రాండ్ తాజాగా లాంచ్ చేసిన 'నానోలాట్ సిరీస్' (Nanolot Series) కిలో ధర ఏకంగా రూ. 10,000 పలుకుతోంది. భారతదేశంలో ఒక అరబికా కాఫీకి ఈ స్థాయిలో ధర రావడం ఇదే మొదటిసారి.
ఆనంద్ మహీంద్రా చేతుల మీదుగా ప్రపంచ స్థాయికి!
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా నేతృత్వంలోని 'నాంది ఫౌండేషన్' గత 25 ఏళ్లుగా అరకు కాఫీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి ఎంతో కృషి చేసింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ, ఆనంద్ మహీంద్రా వంటి దిగ్గజాల భాగస్వామ్యం వెరసి నేడు అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ కాఫీ ప్రస్తుతం ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టారు. అయితే కేవలం 24 గంటల్లోనే మొదటి విడత స్టాక్ ఆన్ లైన్ లో అమ్ముడైపోగా, రెండో విడత కేవలం రెండు గంటల్లోనే ఖాళీ అయిపోయింది.
ఏమిటి ఈ 'నానోలాట్' (Nanolot) ప్రత్యేకత?
సాధారణ కాఫీకి, ఈ నానోలాట్ సిరీస్ కి చాలా తేడా ఉంది. అదెలాగంటే..
- సింగిల్ ప్లాట్ కల్టివేషన్: ఈ కాఫీని ఒక్కొక్క రైతు తనకున్న చిన్న భూభాగంలో చాలా జాగ్రత్తగా పండిస్తారు.
- టెర్రోయిర్ అప్రోచ్ (Terroir Approach): సాధారణంగా ద్రాక్ష తోటలకు, వైన్ తయారీకి వాడే పద్ధతిని ఇక్కడ కాఫీ సాగుకు వాడుతున్నారు. నేల స్వభావం, వాతావరణం కాఫీ రుచిని ప్రభావితం చేస్తాయి.
- మైక్రో-బ్యాచెస్: ఈ కాఫీని చాలా తక్కువ పరిమాణంలో పండిస్తారు. అందుకే దీని నాణ్యత అత్యున్నత స్థాయిలో ఉంటుంది.
- ధర రికార్డు: కిలోకు రూ. 10,000 (సుమారు 100 డాలర్లు) ధర పలకడం ద్వారా ఇండియన్ కాఫీ మార్కెట్‌లో ఒక కొత్త మైలురాయిని సెట్ చేసింది.

గిరిజన రైతులకు లభిస్తున్న ఊతం
నాంది ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వం సమన్వయంతో అరకులోని వేలాది మంది చిన్న మరియు సన్నకారు గిరిజన రైతులకు ఈ కాఫీ సాగులో శిక్షణ ఇచ్చారు. ప్రకృతి సిద్ధమైన (Regenerative Farming) పద్ధతుల్లో పండించడం వల్ల ఈ కాఫీకి విదేశాల్లో, ముఖ్యంగా పారిస్ వంటి నగరాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. పారిస్ లో అరకు కాఫీకి ప్రత్యేక స్టోర్లు ఉండటం గమనార్హం.
మొత్తానికి.. ఏపీ బ్రాండ్‌గా వెలుగొందుతున్న అరకు కాఫీ (araku coffee) ఇప్పుడు కేవలం ఒక కాఫీ మాత్రమే కాదు, ప్రపంచ కాఫీ లెగసీలో ఒక శక్తివంతమైన బ్రాండ్ గా మారింది. ఇంతటి ఖరీదైన కాఫీ గంటల్లోనే అమ్ముడైపోవడమే దీని రుచికి, బ్రాండ్ వాల్యూకు నిదర్శనం అనే చెప్పాలి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications