IPO News: ఈరోజు మార్కెట్లోకి ప్రవేశించిన రెండవ ఐపీవో ఇన్వెస్టర్లను కొంత నిరాశకు గురిచేసింది. ప్రీమియం ధరకు లిస్టింగ్ జరిగినప్పటికీ తర్వాత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఈరోజు మార్కెట్లోకి అరంగేట్రం చేసిన అరేబియా పెట్రోలియం గురించే. మార్కెట్లోకి షేర్లు 10.57 శాతం ప్రీమియం రేటుకు లిస్ట్ అయ్యాయి. సోమవారం బలహీన మార్కెట్‌లో అరేబియా పెట్రోలియం షేర్లు రూ.77.40 వద్ద లిస్టయ్యాయి. అయితే తర్వాత కొద్దిసేపటికే ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగటంతో 4 శాతం మేర క్షీణతను నమోదు చేశాయి. దీంతో NSE SME ప్లాట్‌ఫారమ్‌లో కంపెనీ షేర్ ధర పడిపోయి రూ.74.25కి చేరుకున్నాయి.

అరేబియన్ పెట్రోలియం ఐపీవో మొత్తం 19.91 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. కంపెనీ IPO రిటైల్ కోటా 23.19 రెట్లు, ఇతర కేటగిరీల్లో సభ్యత్వం 15.72 రెట్లు నమోదైంది. ఐపీవో కోసం లాట్ పరిమాణాన్ని 2000 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది. ఎవరైనా ఇన్వెస్టర్ ఇందులో పాల్గొనాలంటే రూ.1,40,000 కనీస పెట్టుబడిగా పెట్టారు. సెప్టెంబర్ 25న తెరవబడి ఐపీవో సెప్టెంబర్ 27న ముగిసింది. ఈ క్రమంలో ఐపీవో ధరను రూ.70గా కంపెనీ ప్రకటించింది. దీని ద్వారా కంపెనీ రూ.20.24 కోట్లను మార్కెట్ల నుంచి సమీకరించింది.
ఐపీవోకు ముందు కంపెనీలో ప్రమోటర్ల వాటా 100% ఉండగా.. ఐపీవో తర్వాత 73.45 శాతానికి తగ్గింది. అరేబియా పెట్రోలియం వివిధ రకాల స్పెషల్ ఆయిల్స్, శీతలీకరణాలను తయారు చేస్తుంది. కంపెనీ తయారు చేసే పెట్రోలియం ఉత్పుత్తులు ఆటోమొబైల్స్, పారిశ్రామిక యంత్రాలు, ఉపకరణాల్లో ఉపయోగిస్తుంటారు.


Click it and Unblock the Notifications