హిండెన్ బర్గ్ నివేదిక అనంతరం తీవ్ర ఒడిదుడుకుల్లో చిక్కుకున్న అదానీ గ్రూపు కంపెనీలు ఇప్పుడిప్పుడే ఆ సంక్షోభం నుంచి బయటపడుతున్నాయి. ఇటీవల గ్రూపు సంస్థలు విడుదల చేస్తున్న త్రైమాసిక ఫలితాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను అదానీ పోర్ట్స్ తాజాగా రిలీజ్ చేసింది.
ఇండియన్ బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) త్రైమాసిక ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. మార్చి 2023తో ముగిసిన ఈ త్రైమాసికానికిగాను 1,141 కోట్ల నికర లాభాన్ని ఆ కంపెనీ నివేదించింది. గతేడాది ఇదే సమయంలో రిపోర్ట్ చేసిన లాభం 1,112 కోట్లతో పోలిస్తే ప్రస్తుతం 3 శాతం పెరిగింది.

గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా అదానీ పోర్ట్స్ ఆర్జించిన ఆదాయం 40 శాతం పెరిగి 5 వేల 797 కోట్లకు చేరుకుంది. "FY23లో APSEZ మంచి పనితీరు కనబరిచింది. అత్యధిక ఆదాయం సాధించి, సంవత్సరం ప్రారంభంలోని EBITDA అంచనాలు మించి అధిక విజయాన్ని సాధించింది. భౌగోళిక వైవిధ్యం, కార్గో మిక్స్ డైవర్సిఫికేషన్ తో పాటు ట్రాన్స్‌పోర్ట్ యుటిలిటీ మోడల్ బలమైన వృద్ధిని కలిగి ఉంది" అని APSEZ CEO కరణ్ అదానీ పేర్కొన్నారు.
"గత 5 ఏళ్లలో APSEZ ఆదాయం మరియు EBITDA 16-18 శాతం CAGR చొప్పున వృద్ధి చెందాయి. అయితే కంపెనీ దేశీయ మార్కెట్ వాటా FY23లో 24 శాతానికి పెరిగింది. తద్వారా ఆదాయం సైతం దాదాపు 27 వేల కోట్ల పెట్టుబడులను నమోదు చేసింది" అని అదానీ వెల్లడించారు. ఇదే త్రైమాసికంలో పోర్ట్స్ వ్యాపారానికి సంబంధించి రెండు మరియు లాజిస్టిక్స్ వ్యాపారంలో మూడు కలిపి మొత్తం 5 బిడ్‌లను కంపెనీ గెలుచుకుంది అని కంపెనీ ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది.


Click it and Unblock the Notifications