ఈ ఏప్రిల్ నెలలో వీకెండ్ హాలిడేస్'తో పాటు బ్యాంకులు కూడా కొన్ని రోజుల్లో మూతపడనున్నాయి. మీరు బ్యాంకులకు సంబంధించిన ఏదైనా పనులు చేయాల్సి వస్తే ముందు బ్యాంకుకు ఏ రోజున ఓపెన్ చేసి ఉంటుందో, ఏ రోజున బంద్ చేసి ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే నేటి కాలంలో బ్యాంకింగ్ సంబంధిత పనులన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. కానీ క్యాష్ డిపాజిట్ చేయడం, చెక్కు డిపాజిట్ చేయడం, డ్రాఫ్ట్ డిపాజిట్ చేయడం, KYC అప్ డేట్ చేయడం లేదా బ్యాంక్ అకౌంటుకు లింక్ చేసిన మొబైల్ ఫోన్ నంబర్ మార్చడం వంటి పనులు ఉంటే, ఈ పనులన్నీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా చేయలేరు. ఏది ఏమైనా మీ నగరంలోని బ్యాంకులు ఏప్రిల్‌లో వరుసగా మూడు రోజుల పాటు ముతపడనున్నాయి. ఏ కారణాల వల్ల బ్యాంకులు మూసివేయబడతాయో తెలుసా..

ఏప్రిల్ 12: ఈ నెలలో రెండవ శనివారం: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం, ప్రతి నెల రెండవ అలాగే నాల్గవ శనివారాలు బ్యాంకులకు సెలవులు ఉంటుంది. ఎప్పటిలాగే ఈసారి కుడి అంటే ఏప్రిల్ 12వ తేదీ రెండవ శనివారం రాబోతుంది. కాబట్టి ఈ రోజున దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రలలో అన్ని బ్యాంకు శాఖలకు ఈ రోజున హాలీడే ఉంటుంది. కాబట్టి ఎలాంటి అక్టీవిటీస్ ఉండవు.
ఏప్రిల్ 13: ఆదివారం (వీకెండ్ హాలిడే): ఏప్రిల్ 13 ఆదివారం కాబట్టి మనందరికీ తెలిసినట్లుగా వీకెండ్ సెలవు కారణంగా అన్ని బ్యాంకులు ఆదివారం రోజున బంద్ ఉంటాయి. బ్యాంకింగ్ సంబంధిత పనులు వరుసగా రెండవ రోజు కూడా సాధ్యం కావు. అయితే ఇలాంటి సమయంలో కస్టమర్లు ATM అండ్ UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించవచ్చు. ఈ సేవలు సేవలు హాలీడేస్ ఇంకా బ్యాంక్స్ బంద్ ఉన్న కూడా యధావిధిగా పనిచేస్తాయి.
ఏప్రిల్ 14: అంబేద్కర్ జయంతి: బాబా సాహెబ్ డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జయంతిని ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజును 'భీం జయంతి' అలాగే 'అంబేద్కర్ జయంతి' అని కూడా పిలుస్తారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ హాలిడే. అందువల్ల, ఏప్రిల్ 14 సోమవారం కూడా బ్యాంకులు మూసివేసి ఉంటాయి. తన జీవితాంతం సమానత్వం కోసం పోరాడిన అంబేద్కర్'ని స్మరించుకునేందుకు అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు.


Click it and Unblock the Notifications