కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలైంది. దింతో ప్రతినెలలాగే ఏప్రిల్ 1 నుండి కొన్ని రూల్స్ మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇవి సామాన్యుడి ఆదాయం పై కాస్త ప్రభావం చూపవచ్చు. అయితే కొత్త ఆర్థిక సంవత్సరంలో అతిపెద్ద మార్పు ఆదాయపు పన్ను నియమాలలో జరిగింది. ఏంటంటే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.12 లక్షల వరకు ఆదాయాన్ని ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించారు. దింతో కొత్త పన్ను విధానం కింద ఉన్నవారు ఈ బెనిఫిట్ పొందుతారు. దీనితో పాటు UPI ట్రాన్సక్షన్స్ సహా కొన్ని రూల్స్ ఇవాళ్టి నుండి మారనున్నాయి.

ట్యాక్స్ రూల్స్ మార్పులు: ఏప్రిల్ 1 నుండి ఆదాయపు పన్ను నియమాలు మారాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక ఆదాయం రూ. 12 లక్షల వరకు ఉంటే పన్ను మినహాయింపును ప్రకటించారు. అదనంగా వేతన జీవులు స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75,000 అదనపు మినహాయింపు లభిస్తుంది. ఈ విధంగా రూ. 12.75 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
UPI అకౌంట్స్ క్లోజ్ :ఏప్రిల్ 1 నుండి UPI ట్రాన్సక్షన్స్ రూల్స్ మారబోతున్నాయి. చాలా కాలంగా ఉపయోగించని మొబైల్ నంబర్‌లకు లింక్ చేసిన UPI అకౌంట్స్ బ్యాంక్ రికార్డుల నుండి తొలగించబడతాయి. మీ ఫోన్ నంబర్ UPI యాప్‌కి లింక్ చేసి మీరు దానిని చాలా కాలంగా ఉపయోగించకపోతే బ్యాంక్ దానిని రికార్డుల నుండి తొలగిస్తుంది అలాగే మీ అకౌంటుకు UPI సర్వీసెస్ నిలిపివేస్తుంది. కాబట్టి, మీరు UPI ఉపయోగిస్తుంటే మీ అకౌంట్ యాక్టివ్‌గా ఉంచుకోవాలి.
FDs మరింత ప్రయోజనకరంగా : మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెడితే మీకో గుడ్ న్యూస్. ఏప్రిల్ 1 నుండి బ్యాంకులు FD, RD అండ్ ఇతర సేవింగ్స్ స్కీమ్స్ పై రూ.1 లక్ష వరకు వడ్డీపై TDS కోత ఉండదు. అయితే ఈ బెనిఫిట్ సీనియర్ సిటిజన్లకు కల్పించారు. అంతేకాదు ఇతర పెట్టుబడిదారులకు కూడా రిలీఫ్ అందిస్తూ వారికి ఈ పరిమితిని రూ.40 వేల నుండి రూ.50 వేలకు పెంచారు. అంటే, ఒక సీనియర్ సిటిజన్ ఒక సంవత్సరంలో FD పై రూ. 1 లక్ష వరకు వడ్డీ పొందితే, దానిపై ఎటువంటి TDS ఉండదు.
GST నియమాలలో మార్పులు: భారత ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరంలో GST నియమాలలో పెద్ద మార్పులు చేస్తోంది. ఇన్‌పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ (ISD) సిస్టం అమలు చేయబోతున్నారు. ఈ మార్పు GST వ్యవస్థను మరింత క్రమబద్ధీకరించే దిశగా ఒక పెద్ద అడుగు.
పాజిటివ్ పే సిస్టమ్: బ్యాంకుల మోసాలను నివారించడానికి, RBI పాజిటివ్ పే సిస్టమ్ (PPS)ను అమలు చేసింది. ఇప్పటికే చాల బ్యాంకులు ఈ సిస్టం అమలు చేస్తున్నాయి. PPS కింద, మీరు రూ. 50,000 కంటే ఎక్కువ చెక్కును జారీ చేస్తే, మీరు చెక్కు గురించి కొంత సమాచారాన్ని ఎలక్ట్రానిక్‌గా బ్యాంకుకు అందించాలి.
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications