గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15 నుంచి కొత్త పింఛన్లు.. దరఖాస్తులు ప్రారంభం..
తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్ శాఖ శుభవార్త చెప్పింది. ఆగస్ట్ 15 నుంచి కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించింది. దాదాపు 2 లక్షల కొత్త పింఛన్లు ఇచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త పింఛన్ల కోసం శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. ప్రాధాన్య క్రమంలో పింఛన్లు మంజూరు చేస్తామని వెల్లడించింది. మొదటగా దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికులు, ఫైలేరియా(బోదకాలు), డయాలసిస్ బాధితులు, దివ్యాంగుల కేటగిరీలో థలసీమియా, సికిల్ సెల్, హిమోఫీలియా బాధితులకు పింఛన్లు మంజూరు చేయనున్నారు. అయితే దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని పేర్కొంది. చివరి తేదీ లేదని వెల్లడించింది.
అయితే గతంలో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే మీ దరఖాస్తు స్థితిని తెలుసుకోవాలని తెలిపింది. ఇందుకోసం మీరు మీ గ్రామ కార్యదర్శి, పట్టణాల్లో అయితే వార్డు అధికారులను సంప్రదించాలని సూచించింది. ఒకవేళ మీ దరఖాస్తు ఆన్ లైన్ లో చూపించకపోతే.. కొత్త మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని వివరించింది. అర్హత కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరింది. పింఛన్లకు గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల కంటే తక్కువ వార్షికాదాయం ఉన్నవారు అర్హులని పేర్కొంది. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు.. మూడెకరాల కంటే ఎక్కువ మాగాణి, 7.5 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట పొలం ఉన్నవారు అనర్హులని తెలిపింది.

ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేటు, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, వృత్తి నిపుణులు, ఆయిల్, రైస్ మిల్లులు, పెట్రోల్ పంపులు, రిగ్ యజమానులు, వారి తల్లిదండ్రులు అనర్హులు. ఇప్పటికే ప్రభుత్వ లేదా స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్నవారు.. నాలుగు చక్రాల వాహనాలు లేదా భారీ వాహనాలున్నవారినీ అనర్హులుని పేర్కొంది. వీరు పింఛన్లకు దరఖాస్తు చేసుకోవద్దని కోరింది. కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ముందుగా చేయూత వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసుకోవాలి. దానిని నింపిన తర్వాత.. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు లేదా మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో ఇవ్వాలి.
దరఖాస్తుతో పాటు కావాల్సిన పత్రాలు కూడా సమర్పించాలి. దరఖాస్తుదారుని ఆధార్ కార్డ్ జిరాక్స్, తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, వితంతు పెన్షన్ పింఛన్ అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం కావాలి. దివ్యాంగుల పెన్షన్ అయితే కనీసం 40% వైకల్యం ఉన్నట్లు తెలిపే సదరం సర్టిఫికేట్ ఉండాలి. చేనేత, గీత పింఛన్లకు సంబంధిత సొసైటీ గుర్తింపు కార్డు ఉండాలి. వీటితో పాటు కుల, ఆదాయధృవీకరణ పత్రాలు అవసరం.ఫైలేరియా(బోదకాలు), డయాలసిస్ బాధితులు, దివ్యాంగుల కేటగిరీలో థలసీమియా, సికిల్ సెల్, హిమోఫీలియా బాధితులు సంబంధిత పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా జూన్ 2న కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. కానీ అది సాధ్యం కాలేదు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications