For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనూహ్య వృద్ధి?: 2025 నాటికి ఆ రంగం రూ.1.48 లక్షల కోట్లకు...

|

వచ్చే ఐదేళ్లలో దేశీయ అప్లయెన్సెస్‌, కన్జ్యూమర్ ఎలక్ర్టానిక్స్‌ పరిశ్రమ భారీ స్థాయిలో వృద్ధి చెందే అవకాశం ఉందని అంచనా. 2025 నాటికి ఈ పరిశ్రమ రెండింతలు అవుతుందని సీమా, ఫ్రోస్ట్‌ అండ్‌ సులివన్‌ ఉమ్మడి నివేదిక అంచనా వేస్తోంది.

ఈ రంగంలో గత కొన్నేళ్లుగా కోట్లాది రూపాయల పెట్టుబడులు రావడం, అలాగే దేశీయంగా తయారీ కూడా క్రమంగా పెరుగుతుండడం కూడా ఈ రంగం అభివృద్ధికి కారణాలుగా విశ్లేషిస్తున్నారు. అయితే 5 స్టార్ రిఫ్రిజిరేటర్ల ధరలు మాత్రం పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

2025 నాటికి రెండింతలు...

2025 నాటికి రెండింతలు...

2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.76,400 కోట్లుగా ఉన్న అప్లయెన్సెస్‌, కన్జ్యూమర్ ఎలక్ర్టానిక్స్‌ పరిశ్రమ పరిమాణం 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి రెండింతలు పెరిగి రూ.1.48 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు కన్జ్యూమర్‌ ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ అప్లయెన్సెస్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (సీమా), ఫ్రోస్ట్‌ అండ్‌ సులివన్‌ ఉమ్మడి నివేదిక పేర్కొంది. ఈ రూ.76,400 కోట్లలో దేశీయ తయారీ ద్వారా సమకూరిన మొత్తం రూ.32,200 కోట్లు.

ఆ ఐదు కేటగిరీల ఆధారంగా...

ఆ ఐదు కేటగిరీల ఆధారంగా...

టెలివిజన్‌ (టీవీ), ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్లు, ఆడియో వంటి కేటగిరీల ఆధారంగా సీమా, ఫ్రోస్ట్‌ అండ్‌ సులివన్‌‌లు ఈ నివేదికను రూపొందించాయి. ఈ ఐదు కేటగిరీల మొత్తం మార్కెట్‌ పరిమాణం 2025 ఆర్థిక సంవత్సరం నాటికి సగటు వార్షిక వృద్ధి రేటు 11.7 శాతంగా ఉంటుందని కూడా ఈ నివేదిక అంచనా వేస్తోంది.

భారీ వ‌ృద్ధికి కారణాలివే...

భారీ వ‌ృద్ధికి కారణాలివే...

గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెరగడం, అందుకు తగ్గట్లుగా రిటైల్‌ స్టోర్ల విస్తరణ, విభిన్న రకాల బ్రాండ్లు అందుబాటులోకి రావడం, విభిన్న రకాల ధరలు, రీప్లేస్‌మెంట్ కాలపరిమితి కూడా తగ్గడం వంటి అంశాలు కన్జ్యూమర్‌ ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ అప్లయెన్సెస్‌ మార్కెట్‌ వృద్ధికి దోహదపడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. దీంతోపాటు దేశీయంగా తయారీ క్రమంగా పెరుగుతోందని, గత కొన్నేళ్లకాలంలో కంపెనీలు దాదాపు రూ.7,000 కోట్ల పెట్టుబడులు పెట్టాయని కన్జ్యూమర్‌ ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ అప్లయెన్సెస్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (సీమా) ప్రెసిడెంట్‌ కమల్‌ నంది పేర్కొన్నారు.

పెరుగుదల ఇలా...

పెరుగుదల ఇలా...

2019 ఆర్థిక సంవత్సరంలో కన్జ్యూమర్‌ ఎలక్ర్టానిక్స్‌ అండ్ అప్లయెన్సెస్‌ ఉత్పత్తులకు దేశీయ విలువ జోడింపు 34 శాతం ఉండగా.. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది 54 శాతానికి పెరిగే అవకాశం ఉంది. అలాగే 2018-19 సంవత్సరంలో ఎయిర్ కండీషనింగ్ మార్కెట్‌ పరిమాణం 65 లక్షల యూనిట్లు ఉండగా.. 2024-25 నాటికి 165 లక్షల యూనిట్లకు పెరగొచ్చు. ఇక రిఫ్రిజిరేటర్‌ మార్కెట్‌ 145 లక్షల యూనిట్ల నుంచి 275 లక్షల యూనిట్లకు పెరిగే అవకాశం ఉంది. అలాగే టెలివిజన్ మార్కెట్‌ 175 లక్షల యూనిట్ల నుంచి 284 లక్షల యూనిట్లకు పెరగవచ్చు.

దేశీయ తయారీ వాటా ఎంతంటే...

దేశీయ తయారీ వాటా ఎంతంటే...

దేశీయ తయారీ వాటా విషయానికొస్తే.. రిఫ్రిజిరేటర్ల విభాగంలో మొత్తం మార్కెట్‌ పరిమాణంలో 55 శాతంగా ఉంటుందని, వాషింగ్‌ మిషన్ల విభాగంలో 75 శాతం వరకు ఉంటుందని కన్జ్యూమర్‌ ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ అప్లయెన్సెస్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (సీమా), ఫ్రోస్ట్‌ అండ్‌ సులివన్‌ ఉమ్మడి నివేదిక పేర్కొంది. ఇక ఆడియో రంగం విషయానికొస్తే.. ఇందులో దేశీయ తయారీ కేవలం 22 శాతంగా ఉంది. ఎఫ్‌డీపీ టీవీలో ఓపెన్‌ సెల్స్‌, చిప్స్‌ను థాయిలాండ్‌, వియత్నాం, తైవాన్‌, చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.

5 స్టార్ రిఫ్రిజిరేటర్ల ధరలు పెరగొచ్చు...

5 స్టార్ రిఫ్రిజిరేటర్ల ధరలు పెరగొచ్చు...

వచ్చే జనవరి నుంచి 5 స్టార్‌ రేటింగ్‌ కలిగిన రిఫ్రిజిరేటర్ల తయారీ వ్యయం రూ.6,000 వరకు పెరిగే అవకాశం ఉందని కూడా ఈ సంయుక్త నివేదిక చెబుతోంది. దీనికి కారణం.. నూతన ఎనర్జీ లేబులింగ్‌ నిబంధనలు అమల్లోకి వస్తుండడం. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. 5 స్టార్‌ శ్రేణి రిఫ్రిజిరేటర్లలో కూలింగ్ కోసం ఉపయోగించే సాంప్రదాయ ఫోమ్స్‌కు బదులుగా వాక్యూమ్‌ పానెళ్లను వినియోగించాల్సి ఉంటుంది. అందువల్ల వీటి ధరలు పెరిగే అవకాశాలున్నాయి.

Read more about: business
English summary

అనూహ్య వృద్ధి?: 2025 నాటికి ఆ రంగం రూ.1.48 లక్షల కోట్లకు... | Appliances & Consumer Electronics Industry expected to double by FY 2024-25

The appliances and consumer electronics industry is projected to double to Rs 1.48 lakh crore by 2024-25, according to a report. The industry had a total market size of Rs 76,400 crore in 2018-19, in which Rs 32,200 crore was contributed from domestic manufacturing, according to the joint report by CEAMA and Frost & Sullivan.
Story first published: Saturday, November 23, 2019, 17:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X