కరోనా మహమ్మారి కారణంగా దాదాపు అన్ని రంగాల్లోని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో 80 శాతం వరకు ఇంటి నుండి వర్క్ నడుస్తోంది. గూగుల్ వంటి సంస్థలు వచ్చే ఏడాది వరకు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. భారత ఐటీ సంస్థలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగిస్తూ వెళ్తున్నాయి. మొబైల్ దిగ్గజం ఆపిల్ కూడా తమ ఉద్యోగులకు ఇంటి నుండి పనిని పొడిగించింది.

వచ్చే ఏడాది జూన్ వరకు
ఆపిల్ సంస్థకు చెందిన మెజార్టీ ఉద్యోగులు 2021 జూన్ వరకు కార్యాలయాలకు వచ్చే అవకాశాలు లేవు. ఈ మేరకు కంపెనీ వర్క్ ఫ్రమ్ హోంను పొడిగించింది. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం వచ్చే జూన్ నాటికి ఎక్కువ మంది ఉద్యోగులను ఆఫీస్‌లకు రమ్మనడం లేదు. ఈ మేరకు ఆపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ వర్క్ ఫ్రమ్ హోం పొడిగింపు అంశాన్ని తమ ఉద్యోగులకు వర్చువల్ సమావేశంలో తెలిపారు. ఉద్యోగులు జూన్ వరకు ఇంటి నుండి పని చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వర్క్ ఫ్రమ్ హోం ద్వారా కూడా ఆశాజనక ఫలితాలు, ఉత్పత్తి ఉంటుందని భావిస్తున్నారు.

ఫేస్ టు ఫేస్‌ను మించింది లేదు కానీ
ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేయడంలో ఉన్న సానుకూలతల్ని టిమ్ కుక్ గుర్తు చేశారు. ఫేస్ టు ఫేస్ కూర్చొని పని చేసే విధానం కంటే మెరుగైన ప్రత్యామ్నాయం లేదన్నారు. అయితే సంస్థ వెలుపలి నుండి కూడా మంచి ఫలితాల కోసం పని చేయడం నేర్చుకోగలిగామని తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో వచ్చిన మార్పులను కొనసాగించేందుకు కృషి చేస్తామన్నారు.

ఇది కష్టమే..
ప్రస్తుత పరిస్థితుల నుండి నేర్చుకోవడం చాలా ముఖ్యమైన విషయమని టిమ్ కుక్ అన్నారు. పరికరాల రూపకల్పన విభాగానికి వర్క్ ఫ్రమ్ హోం పెద్ద సవాల్ అన్నారు. రోబోలను ఇంటి నుండి నియంత్రించడం, ఐపాడ్స్ ద్వారా టెక్నీషియన్లకు మార్గనిర్దేశనం చేయడం ద్వారా లాక్ డౌన్ కాలలో కొంత మేర తయారీని కొనసాగించినట్లు తెలిపారు. కాగా ప్రస్తుతం ఆపిల్ కార్యాలయం నుండి కేవలం 15 శాతం ఉద్యోగులు పని చేస్తున్నారు. గూగుల్ ఇటీవల గూగుల్ ఉద్యోగులు కూడా కొంతమంది కార్యాలయాలకు వస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications