apple: జోరుగా 'మేడ్ ఇన్ ఇండియా' ఐఫోన్స్ అమ్మకాలు.. ఇంతలో భారత్‌కు ఆపిల్ మరో గుడ్‌న్యూస్?
apple: కొత్తగా రిలీజ్ అయిన ఐఫోన్ 15 అమ్మకాల్లో ఆపిల్ దూసుకుపోతోంది. భారత్ లో కూడా తొలిసారిగా మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ విడుదల చేయడంతో.. సేల్స్ పీక్ లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదే జోరులో భారత్ కు ఆపిల్ మరో గుడ్ న్యూస్ చెప్పనుంది.
ఇండియాలో కొత్తగా ఐఫోన్స్ తయారీ ప్రారంభించిన ఆపిల్.. మరో 5 ఏళ్లలో తన ఉత్పత్తిని ఐదు రెట్లు పెంచాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తద్వారా గతేడాది 7 బిలియన్ డాలర్లు ఉన్న ప్రొడక్షన్ ను ఏకంగా 40 బిలియన్ డాలర్లకు పెంచాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పాయి. కంపెనీ టాప్ 5 మార్కెట్లలో భారత్ ఒకటి కావడం వల్ల కంపెనీ ఆ దిశగా ఆలోచిస్తూ ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం భారత్ లో ఐఫోన్‌లను తయారు చేస్తున్న ఆపిల్.. ఐప్యాడ్‌లు లేదా ల్యాప్‌టాప్‌ల ఉత్పత్తికి ప్రస్తుతమైతే ఎటువంటి ఆలోచన లేదని ఓ ప్రభుత్వాధికారి వెల్లడించారు. IT హార్డ్‌వేర్‌కు సంబంధించిన PLI స్కీమ్ లో పార్టిసిపేట్ చేసే ప్రణాళికలు ప్రస్తుతం లేవన్నారు. వారి దృష్టి అంతా ఉత్పత్తిని పెంచడంపైనే కేంద్రీకరించినట్లు చెప్పారు.
గత ఆర్థిక సంవత్సరంలో ఆపిల్ ప్రపంచవ్యాప్తంగా 191 బిలియన్ డాలర్ల విలువైన iPhoneలు, 38.36 బిలియన్ డాలర్ల విలువైన ఇతర వేరబుల్, ఇంటి ఉపకరణాలను విక్రయించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో ఐఫోన్ అమ్మకాలు 4 శాతం మేర 156.77 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇక మిగిలిన ఇతర విభాగాల్లో సైతం స్వల్ప క్షీణత నమోదైంది.


Click it and Unblock the Notifications