Apple Pay: ఓటీపీ, పిన్ లేకుండా స్మార్ట్ వాచ్‌తో పేమెంట్.. అందుబాటులోకి యాపిల్ పే..!
తయారీ సంస్థ ఆపిల్ ఇండియాలో తన ఆపిల్ పే చెల్లింపుల సేవను ప్రారంభించింది. దీని ద్వారా వినియోగదారులు ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్ ద్వారా కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేయవచ్చు. ప్రపంచంలోని అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల మార్కెట్లలో ఒకటైన భారతదేశంలోకి యాపిల్ పే రాక మరింత పొటీ పెంచనుంది. ఈ సేవ ప్రారంభంలో యాక్సిస్ బ్యాంక్ జారీ చేసిన వీసా, మాస్టర్‌కార్డ్ క్రెడిట్ కార్డులకు అందుబాటులో ఉంటుంది. కాలక్రమేణా మరిన్ని బ్యాంకులకు విస్తరించాలి ఆపిల్ యోచిస్తోంది. భారతదేశం ఒక చైతన్యవంతమైన, డిజిటల్ పరిజ్ఞానం ఉన్న జనాభాకు నిలయమని ఆపిల్ పే, ఆపిల్ వాలెట్ వైస్ ప్రెసిడెంట్ జెన్నిఫర్ బెయిలీ అన్నారు.
వారు అత్యున్నత భద్రత, గోప్యతా ప్రమాణాలను ఆశిస్తూనే, నగదు రహిత భవిష్యత్తును స్వీకరిస్తున్నారని.. ఈ రోజు భారతదేశంలోని వినియోగదారులకు ఆపిల్ పేను తీసుకురావడం మాకు చాలా సంతోషంగా ఉందన్నారు. వినియోగదారులు అర్హత గల కార్డులను ఆపిల్ వాలెట్‌కు జోడించి, భారతదేశవ్యాప్తంగా వేలాది స్టోర్‌లు, ఆన్‌లైన్ వ్యాపారుల వద్ద, అలాగే ప్రపంచవ్యాప్తంగా NFC-సామర్థ్యం గల టెర్మినల్స్ వద్ద వాటిని ఉపయోగించవచ్చు. ఆపిల్ ఉత్పత్తులకు బలమైన డిమాండ్, యాక్సిస్ బ్యాంక్, వీసా, మాస్టర్‌కార్డ్‌లతో భాగస్వామ్యాలు తోడవడంతో, ఆపిల్ పేను భారతదేశానికి తీసుకురావడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని ఆపిల్ పే తెలిపింది.

ఐఫోన్, ఐపాడ్, యాపిల్ వాచ్ వంటి వాటిల్లో యాపిల్ యూజర్లు ఈ సేవలను వినియోగించుకోవచ్చన పేర్కొంది. ఆపిల్ పే ద్వారా వినియోగదారులు చెక్అవుట్ వద్ద కార్డ్ పిన్ లేదా ఓటిపిని నమోదు చేయకుండానే చెల్లింపులు చేయవచ్చు. స్టోర్లలో, వినియోగదారులు సైడ్ లేదా హోమ్ బటన్‌ను రెండుసార్లు క్లిక్ చేసి, ఫేస్ ఐడి, టచ్ ఐడి లేదా డివైస్ పాస్‌కోడ్‌ను ఉపయోగించి ప్రామాణీకరించుకుని, తమ ఐఫోన్ లేదా ఆపిల్ వాచ్‌ను కాంటాక్ట్‌లెస్ పేమెంట్ చేయవచ్చు. ట్యాప్ అండ్ పే విధానంలో సులభంగా చెల్లింపులు చేయొచ్చని కంపెనీ పేర్కొంది. యాపిల్ పేతో కస్టమర్లు తమ క్రెడిట్/డెబిట్ కార్డులను వినియోగించినప్పుడు.. ఆ కార్డు వివరాలు యాపిల్ డివైజ్‌లలో గానీ, మా సర్వర్లలో గానీ స్టోర్ అవ్వవని వివరించింది.
వాటిని మర్చంట్లతో షేర్ చేసుకోబోమని, దానికి బదులుగా కస్టమర్లకు ఎన్‌క్రిప్ట్ చేసిన యునిక్ డివైజ్ అకౌంట్ నంబరును కేటాయిస్తామని పేర్కొంది. ఈ వివరాలను సెక్యూర్ ఎలిమెంట్ అనే చిప్‌లో భద్రంగా స్టోర్ చేస్తామని యాపిల్ ప్రకటించింది. లావాదేవీల వివరాలు కూడా యాపిల్ వద్ద ఉండవని స్పష్టం చేసింది. ఈ యాపిల్ పేతో యాపిల్ స్టోర్లతో పాటు బ్లింకిట్, క్రోమా, రిలయన్స్ బ్రాండ్స్, కామెట్, ఇంటర్‌ఫ్లోరా, జొమాటో.. ఇలా వేలాది మర్చంట్ యాప్‌ల్లో చెల్లింపులు చేసుకోవచ్చని తెలిపింది. ఈ సేవలను మరింత విస్తరించేందుకు భారత్‌లోని పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లతోనూ యాపిల్ సంప్రదింపులు జరుపుతోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
