Foxconn: ప్రపంచ వ్యాపారాలకు తెలంగాణ ప్రస్తుతం పెట్టుబడుల గమ్యస్థానంగా మారిపోయింది. దేశదేశాల నుంచి టెక్ కంపెనీలతో పాటు తయారీ రంగంలోని కంపెనీలు హైదరాబాదుకు తరలి వస్తున్నాయి. తక్కువ రేటుకు లేబర్ అందుబాటులో ఉండటం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఈ క్రమంలో ఆపిల్ సంస్థకు సరఫరాదారైన ఫాక్స్‌కాన్ చూపు సైతం తెలంగాణపై పడింది. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు గతంలోనే కంపెనీ వెల్లడించింది. అయితే ఇప్పుడు దానిని మరింతగా పెంచాలని నిర్ణయించింది. డైరెక్టర్ల బోర్డు తెలంగాణలో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడికి ఆమోదం తెలిపిందని Foxconn India ప్రతినిధి V Lee ధృవీకరించారు. ఇదే విషయాన్ని కంపెనీ ఆగస్టు 11న హాంగ్‌కాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో బహిర్గతం చేసింది.

వి లీ చేసిన పోస్టుపై తెలంగాణ ఐటి అండ్ పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు ఆగస్టు 12న ట్వీట్ చేశారు. ఫాక్స్ కాన్ గతంలో ప్రతిపాదించిన 150 మిలియన్ డాలర్ల పెట్టుబడికి తాజాగా ఆమోదించిన 400 మిలియన్ డాలర్లు అదనం కావటం విశేషం. ఫాక్స్‌కాన్ గ్రూప్‌తో మా స్నేహం స్థిరంగా ఉందని.. మొత్తం 550 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో FIT తెలంగాణలో తన వాగ్దానాలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఎలక్ట్రానిక్స్ మేజర్ ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ మేలో తెలంగాణలో తన 500 మిలియన్ డాలర్ల పెట్టుబడిలో భాగంగా కొత్త ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రానికి పునాది వేసింది. ఇక్కడికి సమీపంలోని కొంగర కలాన్‌లో ప్రతిపాదిత ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రం తైవాన్ సంస్థ గ్లోబల్ విస్తరణ వ్యూహానికి ఒక మైలురాయిగా నిలవనుంది. ప్రతిపాదిత సదుపాయం తెలంగాణలో ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేస్తుందని తెలుస్తోంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications