ఉద్యోగి నుంచి సీఈవో వరకూ.. యాపిల్ కొత్త బాస్ జాన్ టెర్నస్ సక్సెస్ స్టోరీ!

యాపిల్ కంపెనీకి కొత్త సీఈవో రాబోతున్నాడు. ప్రస్తుతం పని చేస్తున్న టిమ్ కుక్ కి వచ్చే ఏడాదికల్లా 65 ఏళ్లు నిండుతాయి. దాంతో ఆయన రిటైర్ అవుతారు. ఇప్పుడు ఆయన ప్లేస్ లోకి ఎవరు వస్తారన్నది చాలా ఆసక్తికరంగా మారింది. కొత్త సీఈవోగా జాన్ టెర్నస్(john ternus) పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అసలు ఇతను ఎవరు? సీఈవో స్థాయికి ఎలా ఎదిగాడు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

apple-s-next-ceo-john-ternus-success-story

2011లో యాపిల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన టిమ్ కుక్ 2026 లో పదవి నుంచి రిటైర్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో ఎవర్ని కూర్చోబెట్టాలి అన్న విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది. కంపెనీ బోర్డు సహా సీనియర్ అధికారులందరూ ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. యాపిల్ సీఈవో అంటే ఆ సంస్థకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోగలిగిన వ్యక్తి అయ్యి ఉండాలి. ప్రస్తుతం ఆ సంస్థలో అలాంటి వ్యక్తి కేవలం జాన్ టెర్నస్ మాత్రమే అని టాక్ నడుస్తోంది.

జాన్ టర్నస్ స్టోరీ

జాన్‌ టర్నస్‌ యాపిల్ కంపెనీలో సుమారు పాతికేళ్లుగా పని చేస్తు్న్నాడు. ప్రస్తుతం ఈయన వయసు 50 ఏళ్లు. ఇతను 2001 లో యాపిల్ ప్రొడక్ట్ డిజైనింగ్ టీంలో జాయిన్ అయ్యాడు. అప్పట్నుంచి ఇప్పటి వరకూ యాపిల్ రిలీజ్ చేసిన అన్ని ప్రొడక్ట్స్ డిజైన్ లో జాన్ పనిచేస్తూ వచ్చాడు. ప్రస్తుతం ఇతను యాపిల్ హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. అంతేకాకుండా జాన్‌ టర్నస్‌కు టిమ్ కుక్ దగ్గర మంచి పేరు ఉంది. యాపిల్ మొట్టమొదటి ఐఫోన్ ఎయిర్‌ను పరిచయం చేసింది కూడా ఇతనే. అలాగే నెక్స్ట్ జనరేషన్ ఐప్యాడ్, లేటెస్ట్ ఐఫోన్స్, ఎయిర్‌పాడ్‌లతోపాటు మాక్ లైనప్ ప్రొడక్ట్స్ అన్నింటిలో జాన్ టర్నస్ కీలక వ్యక్తిగా ఉన్నాడు.

మెకానికల్ ఇంజినీర్ గా మొదలుపెట్టి..

యాపిల్ కు సీఈవో కాబోతున్న టెర్నస్.. పెన్సిల్వేనియా యూనివర్సిటీలో చదువుకున్నాడు. 1997లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. చదువుతో పాటు టర్నస్ కు స్విమ్మింగ్ అంటే కూడా ఇష్టం ఉండేది. పలు స్విమ్మింగ్ కాంపిటీషన్స్ లో మెడల్స్ కూడా సాధించాడు. ఇక చదువు పూర్తయిన తర్వాత టర్నస్.. VR హెడ్‌సెట్స్ స్టార్టప్ అయిన వర్చువల్ రీసెర్చ్ సిస్టమ్స్‌లో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేశాడు. అక్కడ నాలుగేళ్లు పని చేసిన తర్వాత యాపిల్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు.

యాపిల్ లో ప్రయాణం ఇలా..

2001లో టర్నస్ యాపిల్ ప్రొడక్ట్ డిజైనింగ్ టీంలో చేరాడు. అప్పుడు స్టీవ్ జాబ్స్ యాపిల్ సీఈవోగా ఉన్నాడు. యాపిల్ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించే దిశగా అడుగులు వేసింది అప్పుడే. అప్పట్నుంచి చాలా కొత్త ప్రొడక్ట్స్ రూపకల్పనలో టర్నస్ పాలుపంచుకన్నాడు. జూనియర్ టీం మెంబర్ గా జాయిన్ అయిన టర్నస్ 2013 నాటికి హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎదిగాడు. ఎయిర్‌పాడ్‌లు, మాక్‌లు, ఐప్యాడ్‌ల డిజైన్ అండ్ డెవలప్ ఎంట్ అతడే చూసుకునేవాడు. ఆ తర్వాత కొంతకాలానికి స్టీవ్ జాబ్స్ మరణించడం, ఆ తర్వాత టిమ్ కుక్ సీఈవో బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. ఇప్పుడు టిమ్ కుక్ వయసు కూడా అయిపోవడంతో తర్వాతి పేరు టర్నస్ ది వినిపిస్తుంది.

నెక్స్ట్ సీఈవో అతనేనా?

యాపిల్ సంస్థలో నడుస్తున్న టాక్ ప్రకారం తర్వాతి సీఈవో బాధ్యతలు టెర్నస్‌కు అప్పజెప్పే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే సీఈవో బాధ్యతల నుంచి వైదొలిగడం గురించి టిమ్ కుక్ ఇప్పటివరకు ఎలాంటి ప్రస్తావన చేయలేదు.
స్టీవ్ జాబ్స్ తర్వాత బెస్ట్ సీఈవోగా టిమ్ కుక్ పేరు సంపాదించాడు. టిమ్ కుక్ నాయకత్వంలో యాపిల్ సంస్థ విలువ 350 బిలియన్ డాలర్ల నుంచి నాలుగు ట్రిలియన్ డాలర్లకు చేరింది. అయితే కంపెనీలో పనిచేసే ఉద్యోగే తన తరువాత సీఈఓగా బాధ్యతలు స్వీకరించాలని కుక్ గతంలో కూడా వెల్లడించారు. దీన్నిబట్టి చూస్తే జాన్ టర్నస్ సీఈవోగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖరారు అనే తెలుస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+