ఐఫోన్ ప్రేమికులకు యాపిల్ కంపెనీ నుంచి ఓ శుభవార్త. అదేమిటంటే.. బడ్జెట్ ధరలో ఐఫోన్. యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. భారతీయ మార్కెట్‌లో దీనికున్న క్రేజ్ తక్కువేం కాదు. కాకపోతే దాని ధరను చూసి కొంతమంది 'అమ్మో..' అనేస్తారు. కొనుక్కోవాలని ఉన్నా.. అంత డబ్బు వెచ్చించలేక చాలామంది ఆండ్రాయిడ్ ఫోన్లతో నెట్టుకొచ్చేస్తున్నారు.
అయితే ఐఫోన్ విషయంలో భారతీయ వినియోగదారుల క్రేజ్‌ను మరింతగా క్యాష్ చేసుకునేందుకు యాపిల్ కంపెనీ సన్నద్ధమవుతోంది. బడ్జెట్ ధరలో.. అంటే తక్కువ ధరలో ఐఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఎప్పుడో కాదు.. జస్ట్ రెండు నెలల్లో.. ఈ ఏడాది మార్చి నాటికల్లా ఈ బడ్జెట్ ఐఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.
ఈ నేపథ్యంలో వచ్చే నెల.. అంటే ఫిబ్రవరి నుంచే ఈ ఐఫోన్ అసెంబ్లింగ్ కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ అసెంబ్లింగ్‌ను హాన్‌హయ్ ప్రిసిషన్ ఇండస్ట్రీ, పెగట్రాన్ కార్పొరేషన్, విస్ట్రన్ కార్పొరేషన్‌లకు అప్పగించింది. 'ఐఫోన్ ఎస్‌ఈ' తరువాత అతి తక్కువ ధరలో వెలువడనున్న హ్యాండ్‌సెట్ ఇదే కావడం విశేషమే.

అలాగే 2020లో 200 మిలియన్ల హ్యాండ్‌సెట్లకు పైగా రవాణా చేయాలని యాపిల్ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. ఈ లక్ష్య సాధనలో త్వరలో మార్కెట్‌లోకి రానున్న 'బడ్జెట్ ఐఫోన్' కంపెనీ అమ్మకాలలో ముఖ్యమైన పాత్ర పోషించనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
'బడ్జెట్ ఐఫోన్' ఫీచర్లు ఇవే...
మార్చి నాటికి భారతీయ మార్కెట్‌లోకి వస్తోందని చెబుతోన్న బడ్జెట్ ఐఫోన్ 2017లో వచ్చిన ఐఫోన్ 8 మాదిరిగా ఉంటుందని అంటున్నారు. ఈ ఫోన్ 4.7 అంగుళాల డిస్‌ప్లే స్క్రీన్ కలిగి, ఆండ్రాయిడ్ ఫోన్ల మాదిరిగా ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా కలిగి ఉంటుందట. ప్రస్తుతానికి దీని ధర గురించి ఎలాంటి అంచనాలు లేవు. యాపిల్ కంపెనీ ప్రతినిధులు కూడా ఈ బడ్జెట్ ఐఫోన్ గురించిన సమాచారం తెలుపడానికి నిరాకరిస్తున్నారు.
2020లో మరిన్ని కొత్త ఫీచర్లతో...
భారత్‌లో శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని, విస్తరించుకోవాలని కూడా యాపిల్ ఇన్‌కార్పొరేషన్ యోచిస్తోంది. ఇందులో భాగంగానే వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు 2020లో సరికొత్త ఫీచర్లు, మరింత వేగవంతమైన ప్రాసెసర్, 3డి బ్యాక్ కెమెరా, 5జీ కనెక్టివిటీ.. తదితర ఫీచర్లతో కూడిన హైఎండ్ ఐఫోన్లను విడుదల చేయాలని భావిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications