Smart Phone Prices Increase: భారీగా పెరిగిన స్మార్ట్ ఫోన్ ధరలు.. ధరలు పెంచిన యాపిల్, ఒప్పొ, పోకో, వన్ ప్లస్, ఐ
స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకునేవారికి షాక్. పలు కంపెనీలు తమ స్మార్ట్ ఫోన్ ధరలను భారీగా పెంచాయి. పోకో తన పాపులర్ మోడల్స్ ఎక్స్ 8 ప్రో , ఎక్స్ 8 ప్రో మాక్స్ ధరలను రూ. 3 వేల వరకు పెంచింది. పెరిగిన ధరతో పోకో ఎక్స్ 8 ప్రో కనీస ధర రూ.40 వేలకి చేరనుంది. ఐకూ, షావోమి, రెడ్మీ, వన్‌ప్లస్, యాపిల్, వివో కూడా తమ ప్రొడక్టుల ధరలను రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు పెంచేశాయి. ఐకూ 15 ధర ఏకంగా రూ.8 వేలు పెరిగింది. వై సిరీస్ ఫోన్ల ధరలను వివో రూ.4 వేల వరకు పెంచేసింది. యాపిల్ ఫోన్ల ధరలు కూడా పెరిగాయి. యాపిల్ దాదాపు రూ.2వేల నుంచి రూ. 5 వేల వరకు ధరలు పెంచింది.
వన్ ప్లస్ తన పలు మోడళ్ల ధరలను రూ. 2,000 నుంచి రూ. 4,000 వరకు పెంచింది. వన్ ప్లస్ నోర్డ్ 6 (12GB+256GB) ధర ఇప్పుడు రూ. 50,999 నుంచి రూ. 52,999కి పెరగ్గా.. 8GB+256GB వేరియంట్ ధర రూ. 44,999 నుంచు రూ. 46,999కి చేరింది. నోర్డ్ సీఈ6 (8GB+256GB) ధర రూ. 39,999 నుంచి రూ. 41,999కి పెరిగింది. అలాగే 8GB+128GB వేరియంట్ ధర రూ. 35,999 నుంచి రూ. 37,999కి పెరిగింది. నోర్డ్ సీఈ6 లైట్ ధర భారీగా పెరిగింది. 6GB+128GB వేరియంట్ ధర రూ. 25,999 నుంచి రూ. 3,000 పెరిగి రూ. 28,999కి పెరగ్గా.. 8GB+128GB వేరియంట్ ధర కూడా రూ. 3,000 పెరిగి రూ. 27,999 నుంచి రూ. 30,999కి చేరింది. ఒప్పో (Oppo) తన వివిధ స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఒప్పో రెనో 16 5G (Oppo Reno 16 5G) ధర రూ. 66,999 నుంచి రూ. 71,999కి (అంటే రూ. 5,000) పెరిగింది. రెనో 16 వేరియంట్ ధర రూ. 59,999 నుండి రూ. 63,999కి (రూ. 4,000 పెంపు) పెరిగింది. పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమలులోకి వచ్చాయి. ఐకూ కూడా ధన మొబైల్స్ ధరలు పెంచినట్లు తెలుస్తోంది.

బడ్జెట్ ఫోన్లు మొదలుకొని ప్రీమియం ఫ్లాగ్‌షిప్ మోడళ్ల వరకు అన్నింటి ధరలూ పెరిగాయి. గతంలో తక్కువ ధరలకు లభించిన ఫీచర్ల ధర కూడా భారీగా పెరిగినట్లు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ ధరలు ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ లో పెరిగే అవకాశం ఉందని భావించారు. కానీ కంపెనీలు ధరలు సడెన్ గా పెంచాయి. అకస్మాత్తుగా ధరలు పెరగడానికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మెమరీ చిప్‌ల కొరత ఏర్పడటమేనని చెబుతున్నారు. ఏఐ టెక్నాలజీ విస్తరిస్తున్న కొద్దీ ఏఐ డేటా సెంటర్ల నుంచి ర్యామ్, నాండ్ మెమరీ చిప్‌లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోందని విశ్లేషిస్తున్నారు. దీనివల్ల ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ ఖర్చులు 90 శాతానికి పైగా పెరిగినట్లు పలు సంస్థలు చెబుతున్నాయి.
డిమాండ్ కు తగ్గట్టుగా సరఫరా లేక చిప్ ధరలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా చిప్ కంపెనీలు ఇప్పటికే చిప్ ధరలు పెంచాయి. దీంతో పెరిగిన ధరలను మొబైల్ కంపెనీలు ఎండ్ యూజర్లకు పాస్ ఆన్ చేస్తున్నారు. అందుకే ధరలు పెంచారు. సాధారణ ద్రవ్యోల్బణం కంటే ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల కొరత ఈ సంక్షోభానికి అసలు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది రెండు సార్లు స్మార్ట్ ఫోన్ల ధరలు పెరిగాయి. శామ్సంగ్, రియల్మీ వంటి మిగతా కంపెనీలు కూడా రాబోయే వారాల్లో తమ ఫోన్ల ధరలను పెంచే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications