iPhone News: సెక్యూరిటీ పరంగా ఇతర ఫోన్లతో పోలిస్తే ఆపిల్ మొబైల్స్ విభిన్నంగా ఉంటాయి. వీటి నుంచి డేటా చోరీ జరగడం దాదాపు అసాధ్యం. అందుకే పెద్ద వ్యాపారుల నుంచి సామాన్యుల వరకు అందరిలోనూ ఐఫోన్ పట్ల విపరీతమై క్రేజ్ ఉంటుంది. అయితే ఈ ఫోన్లలో ఏవైనా సమస్యలు వస్తే మాత్రం కొత్త స్పేర్ పార్ట్స్ ఉపయోగించాల్సిందే. కాగా దీనిపై ఆపిల్ ఓ కీలక అప్‌డేట్ ఇచ్చింది.
ఇప్పటివరకు ఐఫోన్ రిపేర్‌లలో పాత మోడళ్ల భాగాలను ఆపిల్ అనుమతించేది కాదు. కొత్త స్పేర్ పార్ట్ కొనాల్సిందే. కాదని పాతది వాడటానికి ప్రయత్నిస్తే కంపాటబిలిటీ సమస్య తలెత్తినట్లు ఫోన్ వివిధ నోటిఫికేషన్లను పంపిస్తుంది. అయితే ఈ పద్ధతికి ఆపిల్ ఫుల్‌స్టాప్ పెట్టినట్లు ప్రటించింది. ఇకపై పాత మోడళ్ల విడిభాగాలను కూడా ఎంచక్కా వినియోగించుకోవచ్చని పేర్కొంది.

అయితే ఈ అప్‌డేట్ ఐఫోన్ 15 మరియు భవిష్యత్తులో మార్కెట్‌లోకి రానున్న కొత్త మోడళ్లకు మాత్రమే వర్తిస్తుందని ఆపిల్ వెల్లడించింది. వినియోగదారులు తమ ఐఫోన్‌లను చవకగా, ఎక్కువకాలం మన్నే విధంగా రిపేర్ చేయించుకోవడానికి మరియు పర్యావరణ హితమైన ఎంపికగా ఉపయోగపడనున్నట్లు తెలిపింది.
ఐఫోన్ వినియోగదారులు పాత స్క్రీన్‌లు, బ్యాటరీలు మరియు కెమెరాలను ఇకపై కొత్త మోడళ్లలో స్పేర్ పార్ట్స్‌గా ఉపయోగించగలరు. అవి ఆపిల్ కొత్త విడి భాగాలతో సమానంగా పని చేస్తాయి. రానున్న రోజుల్లో కొత్త ఐఫోన్‌లలో పాత ఫేస్ ID మరియు టచ్ ID సెన్సార్‌లను ఉపయోగించడానికి ఆపిల్ అనుమతించనుంది. లాజిక్ బోర్డ్ రీప్లేస్‌మెంట్ మినహా ఇతర మరమ్మతుల కోసం ఇకపై ఫోన్ సీరియల్ నంబర్ షేర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు.
అయినప్పటికీ ఐఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా, దాని భాగాలను తీసివేయలేమని మరియు ఇతర ఐఫోన్‌లను రిపేర్ చేయడానికి ఉపయోగించలేమని ఆపిల్ స్పష్టం చేసింది. ఇందుకోసం యాక్టివేషన్ లాక్ ఫీచర్‌ను విస్తరిస్తున్నట్లు చెప్పింది. దొంగిలించబడిన ఐఫోన్‌లను ఇతరులు ఉపయోగించకుండా ఇది నిరోధిస్తుందని వెల్లడించింది. ఈ తరహా ఫోన్స్ నుంచి స్పేర్ పార్ట్ తీసి మరో ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేస్తే ఆ భాగం సరిగ్గా పనిచేయదని భరోసా ఇచ్చింది.
అంతేకాకుండా వినియోగదారులు తమ ఐఫోన్‌లలో ఏ పార్ట్‌లు ఉన్నాయో, అవి కొత్తవో లేదా ఉపయోగించినవో కూడా తెలుసుకునే వెసులుబాటు కల్పించనుంది. ఐఫోన్‌లోని సెట్టింగ్స్ యాప్‌లో ప్రతి పార్ట్ పక్కన అది కొత్తదా లేదా ఉపయోగించినదా, నిజమైన ఆపిల్ పార్టేనా అని వినియోగదారుకు తెలియజేసే సమాచారం ఉంటుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications