iPhone 18 సిరీస్‌లో భారీ మార్పులు.. ధరలు పెరగడమే కాదు.. లాంచ్ డేట్‌లోనూ పెద్ద ట్విస్ట్!
ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఏదైనా ఉందంటే అది ఆపిల్ ఐఫోన్ మాత్రమే. అయితే రాబోయే iPhone 18 సిరీస్ విషయంలో ఆపిల్ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈసారి రాబోయే ఫోన్ల ధరలు భారీగా పెరగడమే కాకుండా, లాంచ్ అయ్యే విధానంలో కూడా ఆపిల్ తన సంప్రదాయాన్ని మార్చుకోబోతోంది. ముఖ్యంగా ప్రో (Pro) మోడల్స్ కొనాలనుకునే వారు తమ జేబులకు మరింత చిల్లు పడక తప్పదని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
కొరియన్ టిప్‌స్టర్ 'yeux1122' అందించిన లీక్స్ ప్రకారం.. ఐఫోన్ 18 సిరీస్ లో భాగంగా.. iPhone 18 Pro, Pro Max మోడల్స్ ధరలు గతంలో కంటే చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఫోన్లలో వాడే DRAM, NAND మెమరీ చిప్స్ ధరలు అమాంతం పెరగడమే. ప్రస్తుతం చిప్ తయారీ సంస్థలన్నీ 'ఏఐ (AI)' సర్వర్ల తయారీకి కావాల్సిన కాంపోనెంట్స్ పై దృష్టి పెట్టడంతో, సాధారణ వినియోగదారుల ఫోన్లలో వాడే చిప్స్ కొరత ఏర్పడి ధరలు పెరిగాయి. దీనికి తోడు కొత్తగా రాబోయే A20 చిప్ సెట్ తయారీ ఖర్చు కూడా భారీగా పెరగడం ఆపిల్ కు భారంగా మారింది.
బేస్ మోడల్ ధర పెరగదు కానీ.. అక్కడే ఒక ట్విస్ట్ ఉంది!
ఒకవైపు ప్రో మోడల్స్ ధరలు పెరుగుతుంటే.. బేస్ మోడల్ అయిన ఐఫోన్ 18 (iPhone 18) ధరలో మాత్రం మార్పు ఉండదని బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మోర్గాన్ వంటి సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఇది వినడానికి శుభవార్తలా ఉన్నా, ఇందులో ఒక పెద్ద 'ట్విస్ట్' ఉంది.
ఆపిల్ ఈసారి తన లాంచ్ వ్యూహాన్ని మార్చబోతోంది. సాధారణంగా ప్రతి ఏడాది సెప్టెంబర్ లో అన్ని మోడల్స్ ఒకేసారి విడుదలవుతాయి. కానీ ఈసారి సెప్టెంబర్ లో కేవలం ప్రో మోడల్స్ మరియు కొత్తగా రాబోతున్న 'ఐఫోన్ ఫోల్డ్ (iPhone Fold)' మాత్రమే విడుదల కానున్నాయి.
2027 వరకు ఆగాల్సిందేనా?
అతి తక్కువ ధరలో లభించే బేస్ ఐఫోన్ 18 (iPhone 18) కోసం మీరు ఎదురుచూస్తుంటే.. మీరు 2027 వరకు వేచి చూడాల్సిందేనని నివేదికలు చెబుతున్నాయి. అంటే ఈ ఏడాది ఐఫోన్ కొనాలనుకునే వారికి తక్కువ ధర ఆప్షన్ అందుబాటులో ఉండకపోవచ్చు. అయితే మీరు ఎక్కువ స్టోరేజ్ లేదా ఎక్కువ ర్యామ్ ఉన్న మోడల్ కావాలనుకుంటే.. బేస్ మోడల్‌లో కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది.
మొత్తానికి, ఈ ఏడాది ఆపిల్ తన ప్రీమియం మార్కెట్ ను మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. దీని ఎఫెక్ట్ ఇండియన్ మార్కెట్ పై భారీగానే పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ప్రీమియం ఫోన్ల కంటే మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్లకే ఎక్కువ డిమాండ్ కనిపిస్తుంది. సో.. ఐఫోన్ లవర్స్.. ఒకవేళ మీరు ఐఫోన్ అప్‌గ్రేడ్ అవ్వాలనుకుంటే.. ఇప్పుడే డబ్బులు దాచుకోవడం మొదలుపెట్టండి లేదా 2027 వరకు ఓపిక పట్టండి!


Click it and Unblock the Notifications