Foxconn: బెంగళూరులో ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబడి..! లక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం..
Apple Inc. భాగస్వామి ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ స్థానిక ఉత్పత్తిని పెంచడానికి భారతదేశంలో ఒక కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా సుమారు 700 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. వాషింగ్టన్-బీజింగ్ ఉద్రిక్తతలు పెరిగేకొద్దీ చైనా నుంచి తమ ప్లాంట్లను ఇతర ప్రాంతాలకు తరలించడానికి యాపిల్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

బెంగళూరు
కర్ణాటక రాజధాని బెంగళూరులోని విమానాశ్రయానికి సమీపంలోని 300 ఎకరాల స్థలంలో ఐఫోన్ విడిభాగాలను తయారు చేయడానికి ప్లాంట్‌ను నిర్మించాలని ఫాక్స్‌కాన్ యోచిస్తోంది. ఈ ప్లాంట్ లో Apple హ్యాండ్‌సెట్‌లను తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. Foxconn ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం కోసం కొన్ని భాగాలను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తోంది.
భారత్, వియత్నాం
ఫాక్స్‌కాన్ భారత్ లో ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తే.. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద ప్లాంట్ అయ్యే అవకాశం ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారుగా చైనా తన హోదాను కోల్పోయే అవకాశం ఉంది. Apple, ఇతర US బ్రాండ్‌లు భారత్, వియత్నాం వంటి ప్రత్యామ్నాయలో కోసం అన్వేషిస్తున్నాయి. బెంగళూరులో ఫాక్స్ కాన్ ప్లాంట్ ఏర్పాటు తో సుమారు 100,000 ఉద్యోగాలను వస్తాయని భావిస్తున్నారు.

200,000 మంది ఉద్యోగులు
చైనీలోని జెంగ్‌జౌలో కంపెనీలోని విశాలమైన ఐఫోన్ అసెంబ్లీ కాంప్లెక్స్ ప్రస్తుతం 200,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కోవిడ్ తో ఈ కాంప్లెక్స్ చాలా రోజులు మూతపడింది. దీంతో కంపెనీ ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో చైనాలో కాకుండా ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలని ఫాక్స్ కాన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications