ట్రంప్‌కు ఆపిల్ కంపెనీ భారీ షాక్..హైదరాబాద్‌కు కొత్త ప్రాజెక్టును తరలించిన ఐటీ దిగ్గజం
హైదరాబాద్‌లో ఆపిల్ తన ఉనికిని మరింతగా విస్తరించింది. గచ్చిబౌలి సమీపంలోని నానక్‌రామ్‌గూడలో ఉన్న ప్రముఖ వేవ్‌రాక్ క్యాంపస్‌లో ఆపిల్ తాజాగా 64,125 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ప్రాప్‌స్టాక్ ఆధారంగా బయటపడిన రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. కంపెనీ 60 నెలల కాలపరిమితితో రూ. 80.15 లక్షల ప్రారంభ నెలవారీ అద్దె చెల్లించనుంది. ఇందులో చదరపు అడుగుకు రూ. 125 అద్దెగా నిర్ణయించబడింది. అందులో రూ. 74.18 వార్మ్‌షెల్ అద్దె, రూ. 50.82 ఫిట్‌అవుట్ అద్దెగా విభజించబడింది. లీజు ఒప్పందం ప్రకారం..అద్దెపై ప్రతి సంవత్సరం 4.77 శాతం పెరుగుదల కూడా ఉంటుంది. అదనంగా రూ. 4.80 కోట్ల డిపాజిట్ చెల్లింపునకు ఆపిల్ కంపెనీ అంగీకరించింది.
కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ దిగుమతులపై సుంకాలను పెంచిన నేపధ్యంలో.. ఆపిల్‌పై తన తయారీ యూనిట్లను అమెరికాకు మళ్లించే ఒత్తిడి పెరుగుతోంది. ఈ వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో కూడా, apple భారత్‌లో ముఖ్యంగా హైదరాబాద్‌లో తన విస్తరణను బలోపేతం చేస్తుండటం గమనార్హంగా చెప్పవచ్చు. నిజానికి సుంకాల ఒత్తిడి కారణంగానే ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ అమెరికాలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఇండియా తన టాలెంట్ పూల్, తక్కువ ఖర్చులు, గ్లోబల్ ఇంజనీరింగ్ సామర్థ్యాల వలన ఆపిల్ వ్యూహంలో కీలక భాగంగా కొనసాగుతోంది.

హైదరాబాద్ ఆపిల్‌కు చాలా కాలంగా ఒక ప్రధాన కేంద్రంగా కొనసాగుతోంది. ఆపిల్ మ్యాప్స్ అభివృద్ధి కోసం నగరంలోని ఈ కార్యాలయం గ్లోబల్ స్థాయిలో కీలకమైన ప్రాజెక్టులపై పని చేస్తోంది. 2016లో స్వయంగా టిమ్ కుక్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం జియోస్పేషియల్ టెక్నాలజీ, డేటా మోడలింగ్ వంటి విభాగాల్లో హైదరాబాద్ టీమ్స్ పనిచేస్తూ ఆపిల్‌కు అంతర్జాతీయ ప్రాజెక్టులకు మద్దతు ఇస్తున్నాయి.ఈ కార్యాలయ విస్తరణతో పాటు, ఆపిల్ యొక్క తైవానీస్ కాంట్రాక్ట్ తయారీదారు ఫాక్స్‌కాన్ హైదరాబాద్ నగరంలో ఎగుమతి కోసం ఎయిర్‌పాడ్స్ ఉత్పత్తిని ప్రారంభించింది.
హైదరాబాద్‌తో పాటు ఆపిల్ బెంగళూరులో కూడా తన ఉనికిని విస్తరిస్తోంది. తాజాగా కంపెనీ 2.7 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని పదేళ్లపాటు రూ. 1,010 కోట్ల అద్దెకు లీజు తీసుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఇది దక్షిణ భారతదేశంలో ఆపిల్ పెరుగుతున్న ప్రాధాన్యతను సూచిస్తుంది.రిటైల్ రంగంలో కూడా ఆపిల్ భారతీయ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఇప్పటికే ముంబై, ఢిల్లీ నగరాల్లో స్టోర్లు ప్రారంభించిన కంపెనీ, త్వరలో బెంగళూరులోని హెబ్బాల్ టెక్ హబ్‌లో ఫ్లాగ్‌షిప్ స్టోర్ ను, అలాగే పూణేలో కొత్త స్టోర్ ను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఇది ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వృద్ధిని లక్ష్యంగా చేసుకున్న విస్తృత వ్యూహంలో భాగంగా చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications