డిసెంబరులో అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన సంగతి మీకు తెల్సిందే. అయితే ఈ నెల జనవరి 20న జరగనున్న ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ముందు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకార నిధికి 1 మిలియన్ డాలర్లు (సుమారు 8.5 కోట్లకు పైమాటే) విరాళంగా ఇవ్వాలని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ నిర్ణయించినట్లు యాక్సియోస్ నివేదిక వెల్లడించింది. టీం కుక్ ఈ ప్రమాణస్వీకారోత్సవాన్ని ఒక ముఖ్యమైన అమెరికన్ సంప్రదాయంగా భవిస్తూ, "స్పిరిట్ ఆఫ్ యూనిటీ"కి ప్రతీకగా అందిస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్‌లో అతిపెద్ద ట్యాక్స్ పెయర్ ఆపిల్ కాగా, ఈ విరాళం కంపెనీ విరాళంగా కాకుండా టీం కుక్ తన వ్యక్తిగతంగా ఇస్తున్నారు.
ప్రమాణస్వీకారోత్సవానికి టెక్ అండ్ కార్పొరేట్ దిగ్గజాల విరాళాలు
చాల ప్రముఖ సంస్థలు, ఎగ్జిగ్యూటివులు ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవానికి విరాళాలు అందిస్తున్నట్లు తెలిపాయి. అమెజాన్ కూడా $1 మిలియన్ విరాళంగా అందిస్తుండగా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రమాణస్వీకారోత్సవ ఈవెంట్ లైవ్ ప్రసారం చేయనుంది. నార్త్ అమెరికాకు చెందిన టొయోటా మోటార్, ఫోర్డ్ అండ్ జనరల్ మోటార్స్ ఈ ఈవెంట్ కోసం $1 మిలియన్ల విరాళంతో పాటు వాహనాల సహకారం అందిస్తామని తెలిపాయి.

ఆర్థిక రంగంలో చూస్తే సిటాడెల్ LLC వ్యవస్థాపకుడు కెన్ గ్రిఫిన్ ఎన్నికల సమయంలో ట్రంప్ తరుపున ప్రచారం చేయనప్పటికీ $1 మిలియన్ విరాళంగా ఇవ్వనున్నారు. రిటైల్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ రాబిన్‌హుడ్ $2 మిలియన్లను విరాళంగా అందించగా, ఉబెర్ టెక్నాలజీస్ అండ్ సీఈఓ దారా ఖోస్రోషాహి చేరొక్క $1 మిలియన్ విరాళంగా అందిస్తున్నారు.
ఆపిల్ $95 మిలియన్ సెటిల్‌మెంట్
ఆపిల్ వినియోగదారుల మాటలను వినడానికి వర్చువల్ అసిస్టెంట్ సిరిని ఉపయోగిస్తోందని ఆరోపిస్తూ వేసిన దావాలో $95 మిలియన్ల సెటిల్మెంట్ ఆపిల్ అంగీకరించింది. ఐదేళ్లుగా కొనసాగుతున్న ఈ వ్యాజ్యంలో సిరి దశాబ్దలుగా వినియోగదారుల సంభాషణలను రహస్యంగా రికార్డ్ చేసిందని ఆరోపించింది. అయితే ఈ తరుణంలోనే టిమ్ కుక్ ఈ విరాళం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు.
ప్రైవసీని "ప్రాథమిక మానవ హక్కు"గా ఎల్లప్పుడూ నొక్కి చెప్పే Apple సంస్థ, ఈ కేసులో ఎలాంటి తప్పు చేయలేదని ఖండించింది. కాలిఫోర్నియా ఫెడరల్ కోర్ట్ దీన్ని ఆమోదించినట్లయితే ఈ పరిష్కారం కోసం కోట్ల మంది Apple వినియోగదారులు సమస్యకి ప్రతి డివైజ్ కి $20 వరకు క్లెయిమ్ చేయవచ్చు. అయితే కస్టమర్లలో 3% నుండి 5% మంది మాత్రమే క్లెయిమ్‌లను దాఖలు చేస్తారని నివేదికలు సూచిస్తున్నాయి.
ఇతర విరాళాలు
టిమ్ కుక్ $1 మిలియన్ విరాళం ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఉన్నత స్థాయి ఆర్థిక సహకారాల వరుసలో నిలుస్తుంది. ఈ ఈవెంట్‌కు ఆటోమోటివ్, టెక్నాలజీ అండ్ ఫైనాన్స్‌తో సహా వివిధ పరిశ్రమల నుండి మద్దతు లభించింది.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications