Tim Cook: ఆపిల్ ఉత్పత్తులకు ఎంత డిమాండ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇటీవల ఇండియా మార్కెట్లపై దృష్టి పెట్టిన మెుబైల్ దిగ్గజం తన కస్టమర్ల కోసం భారత దేశంలో స్టోర్లను ఏర్పాటు చేస్తోంది.
ఇందులో భాగంగా తొలి స్టోర్ ముంబైలో నేడు ప్రారంభమైంది. ముఖేష్ అంబానికి చెందిన Jio World Drive మాల్‌లో దీనిని ఏర్పాటు చేస్తోంది. దీనిని ప్రారంభించేందుకు నేరుగా ఆపిల్ సీఈవో టిమ్ కుక్ రావటంతో సెలబ్రిటీలు, ఫ్యాన్స్ తో మాల్ ప్రాంగణం కిక్కిరిపోయింది.

ఈ క్రమంలో ఒక ఫ్యాన్ పాత ఆపిల్ కంప్యూటర్ తీసుకొచ్చి టిమ్ కుక్ కు తీసుకొచ్చి చూపటంతో కుక్ ఆనందంలో మునిగిపోయారు. స్టోర్ ఏర్పాటుతో ఆయనకు ముంబై వాసులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇదే సమయంలో బాలీవుడ్ నటి దీక్షా సేద్ టిమ్ కు వడ పావ్ ఆఫర్ చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, సింగర్ అర్మన్ మాలిక్, బోణీ కపూర్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆపిల్ సీఈవోను కలిశారు.
దీని తర్వాత బెంగళూరు, దిల్లీల్లో సైతం త్వరలోనే తమ సొంత స్టోర్లను ఏర్పాటు చేయటానికి ఆపిల్ సంస్థ ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది. ముంబైలో శక్తి, సృజనాత్మకత, అభిరుచి అపురూపంగా ఉందని టిమ్ కుక్ ట్వీట్ చేశారు. Apple BKCని ప్రారంభించేందుకు చాలా సంతోషిస్తున్నట్లు అందులో వెల్లడించారు.
భారత ఆర్థిక రాజధాని ముంబైలోని 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న స్టోర్ బయట భారీ క్యూ కనిపించింది. దాదాపు 100 మందికి పైగా ఆపిల్ వినియోగదారులు, అభిమానులతో కలిసి CEO టిమ్ కుక్ ఫోటోలకు పోజులిచ్చారు. నగరానికి ప్రత్యేకమైన ఐకానిక్ బ్లాక్ అండ్ ఎల్లో క్యాబ్‌ల నుంచి స్టోర్ డిజైన్‌ను రూపొందించారు. ఇదే క్రమంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో రెండో స్టోర్‌ను గురువారం ఆపిల్ ప్రారంభిస్తోంది.
అయితే దీనిపై ఆండ్రాయిడ్ యూజర్లు మాత్రం మీమ్స్ చేస్తున్నారు. ఆపిల్ వినియోగదారులపై కామెడీ ట్రోల్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications