సత్తా చాటిన భారతీయుడు! యాపిల్ కొత్త వైస్ ప్రెసిడెంట్‌గా అమర్ సుబ్రమణ్య! ఇతను ఎవరంటే..

ప్రపంచం వ్యాప్తంగా పెద్ద పెద్ద టెక్ కంపెనీలలో భారతీయులే కీలక వ్యక్తులుగా ఉన్నారు. ఇప్పుడు యాపిల్ కూడా అదేబాటలో నడుస్తోంది. అమర్ సుబ్రమణ్య(Amar Subramanya) అనే భారతీయుడ్ని తన ఏఐ వైస్ ప్రెసిడెంట్ గా నియమించింది. ఇంతకీ ఎవరీ సుబ్రమణ్య? యాపిల్ ఈయన్నే ఎందుకు నియమించింది. ఈయన గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

apple appoints Amar Subramanya new vp ai apple intelligence strategy former google microsoft executive

టెక్ ప్రపంచంలో అత్యంత కీలకమైన AI (Artificial Intelligence) విభాగంలో Apple ఒక ముఖ్యమైన నాయకత్వ మార్పును ప్రకటించింది. AI సామర్థ్యాలను వేగవంతం చేయాలనే లక్ష్యంతో, ఆ సంస్థ తన కొత్త వైస్ ప్రెసిడెంట్ గా ప్రముఖ AI పరిశోధకుడు అమర్ సుబ్రమణ్యను నియమించింది. దశాబ్దాలుగా ఈ స్థానంలో ఉన్న జాన్ జియాన్నండ్రియా (John Giannandrea) ను పక్కకు తప్పించి అమర్ కు ఈ బాధ్యతలు అప్పగించింది.

ఎవరీ సుబ్రమణ్య

భారతీయ మూలాలున్న అమర్ సుబ్రమణ్య.. AI రంగంలో దశాబ్దాల అనుభవం కలిగిన వ్యక్తి. ఆయన Apple లో చేరడానికి ముందు మైక్రోసాఫ్ట్ (Microsoft)లో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ AIగా పనిచేశారు. అంతకుముందు ఆయన గూగుల్ (Google)లో 16 సంవత్సరాలు పనిచేశారు. అక్కడ, ముఖ్యంగా జెమినీ అసిస్టెంట్ (Gemini assistant) కోసం ఇంజనీరింగ్ హెడ్‌గా కీలక పాత్ర పోషించారు. ఏఐ పరిశోధనల్లో ఈయనకు చాలా అనుభవం ఉంది. పెద్ద ఎత్తున AI ప్రొడక్ట్స్ ను అమలు చేయడంలో అమర్ ఎక్స్ పర్ట్!

యాపిల్ AI వ్యూహం

సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన క్రైగ్ ఫెడరిగి(Craig Federighi)కి అమర్ నేరుగా రిపోర్ట్ చేస్తారు. అమర్ సుబ్రమణ్య ముఖ్యంగా పర్యవేక్షించే పనులు ఇవే..

  • Apple ఫౌండేషన్ మోడల్స్ (Foundation Models): దీని ద్వారా కంపెనీ తన AI కోర్‌ను మరింత పటిష్టం చేస్తుంది.
  • మెషీన్ లెర్నింగ్ రీసెర్చ్ (ML Research): మెషిన్ లెర్నింగ్ రీసెర్చ్ ద్వారా అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడం.
  • AI సేఫ్టీ(AI Safety and Evaluation): యూజర్లకు సేఫ్ ఏఐ డిజిటల్ ఎక్స్‌పీరియెన్స్ ను అందించడం.

Apple CEO స్వాగతం

Apple CEO టిమ్ కుక్ (Tim Cook).. పాత వైస్ ప్రెసిడెంట్ జాన్ జియాన్నండ్రియా చేసిన కృషికి కృతజ్ఞతలు తెలుపుతూనే, కొత్త వైస్ ప్రెసిడెంట్ అయిన అమర్ సుబ్రమణ్యను స్వాగతించారు. "Apple వ్యూహంలో AI ఎప్పుడూ కేంద్రంగా ఉంది. క్రైగ్ నాయకత్వ బృందంలోకి అమర్‌ను ఆహ్వానించడం, ఆయన అసాధారణమైన AI నైపుణ్యాన్ని Apple కు తీసుకురావడం మాకు సంతోషంగా ఉంది" అని కుక్ అన్నారు.

ఏఐ "సిరి" కోసం..

యాపిల్.. వచ్చే సంవత్సరంలో మరింత అప్ డేటెడ్ , ఏఐ ఇంటిగ్రేటెడ్ సిరి (Siri) వెర్షన్ ని రెడీ చేయబోతోంది. ఈ తరుణంలో అమర్ సుబ్రమణ్య యొక్క నియామకం Apple కు నిర్ణయాత్మకమైన దశగా మారింది. AI పరిశోధన, దానిని ఉత్పత్తులలో అనుసంధానం చేయడంలో ఆయనకున్న లోతైన అనుభవం Apple యొక్క భవిష్యత్తు 'Apple ఇంటెలిజెన్స్' ఫీచర్లకు ఎంతో అవసరం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+