Defence Stock: స్మాల్ క్యాప్ డిఫెన్స్ స్టాక్ పరుగులు.. రూ.7 నుంచి రూ.108కి ర్యాలీ..
Apollo Micro Systems: చాలా కాలంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో డిఫెన్స్ రంగానికి చెందిన కంపెనీల షేర్లు పరుగులు తీస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు సైతం గతకొంత కాలంగా ఈ రంగంలో కొత్త ఫండ్స్ లాంచ్ చేయటం ఇన్వెస్టర్ల నుంచి స్పందనకు అద్దం పడుతోంది.
ఈ క్రమంలో నేడు అపోలో మైక్రో సిస్టమ్స్ కంపెనీ షేర్లు ఫోకస్‌లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 2.35 గంటల సమయంలో స్టాక్ ధర రూ.106 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఇంట్రాడేలో స్టాక్ గరిష్ఠంగా నేడు ఎన్ఎస్ఈలో రూ.108.40 ధరకు చేరుకుంది. అయితే నేడు అనూహ్యంగా కంపెనీ షేర్ల ధరల పెరుగుదలకు కారణం డిఫెన్స్ కేటగిరీలోని భారత్ డైనమిక్స్ సంస్థ నుంచి రూ.10.90 కోట్ల విలువైన ఆర్డర్ పొందటం కారణంగా తెలుస్తోంది. భారీ ఆర్డర్ అందుకున్న తర్వాత స్మాల్ క్యాప్ కంపెనీ షేర్లలో పెరుగుదలతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3250 కోట్లకు చేరుకుంది.

కంపెనీకి వచ్చిన ఆర్డర్ వివరాలను పరిశీలిస్తే.. భారత్ డైనమిక్స్ నుంచి హెవీ డ్యూటీ టార్పెడోల కోసం సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ యూనివర్సల్ హోమింగ్ సిస్టమ్ కోసం ఆర్డర్ చేసినట్లు అపోలో మైక్రో సిస్టమ్స్ తెలిపింది. అయితే డీఆర్‌డీవో సహకారంతో ఈ టెక్నాలజీని తొలిసారిగా అభివృద్ధి చేశారు. దీనిని వ్యూహాత్మక జలాంతర్గాముల్లో అమర్చబడుతుందని కంపెనీ వెల్లడించింది. రానున్న రోజుల్లో ఈ తరహా భారీ డిమాండ్లను తాము తీర్చగలమని అందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే హైదరాబాద్ హార్డ్‌వేర్ పార్క్‌లో యూనిట్ III సౌకర్యం ఫిబ్రవరి 2025 నాటికి అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది.
ఈ ప్రాజెక్ట్‌లో యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ కోసం రాకెట్ గైడెడ్ బాంబ్‌ను కంపెనీ అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించింది. సాల్వోస్‌లోని ఓడల నుంచి కాల్చగలిగే సామర్థ్యం ఉందని పేర్కొంది. ఈ విజయం రాకెట్ గైడెడ్ బాంబ్‌ల పూర్తి అభివృద్ధి, తయారీలో కంపెనీ ప్రవేశాన్ని సూచిస్తుందని చెప్పింది. రానున్న కాలంలో భూమి, గాలి, సముద్ర యుద్ధ పరికరాల్లో ఇలాంటి సాంకేతికను అభివృద్ధికి తమకు ఊతం ఇస్తుందని పేర్కొంది.
ఇదే క్రమంలో నేవల్ ఆర్డరింగ్ కంట్రోల్ నుంచి రూ.5.73 కోట్ల విలువైన ఆర్డర్‌కు L1గా అపోలో మైక్రో సిస్టమ్స్ ఎంపికైనట్లు సమాచారం. ఐదేళ్ల కిందట ఒక్కో షేరు ధర కేవలం రూ.7 స్థాయి నుంచి 1300 శాతం వృద్ధితో ప్రస్తుతం స్టాక్ ధర రూ.108కి చేరుకుంది. అలాగే గడచిన మూడేళ్ల కాలంలో కంపెనీ షేర్లు తమ ఇన్వెస్టర్లకు 825 శాతం రాబడిని అందించాయి. ఇక స్మాల్‌క్యాప్ డిఫెన్స్ స్టాక్‌లు ఏడాది కాలంలో 94% వృద్ధిని నమోదు చేసింది.


Click it and Unblock the Notifications